News April 2, 2025
నిందితుడిని కఠినంగా శిక్షించాలి: అనిత

AP: విశాఖలో ప్రేమోన్మాది దాడి <<15968879>>ఘటనపై <<>>హోంమంత్రి అనిత స్పందించారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చీతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అనిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. దాడికి పాల్పడిన నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు. యువతి తల్లి లక్ష్మి మృతిపై హోంమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Similar News
News April 10, 2025
రియాన్ పరాగ్ ఔటా? నాటౌటా?

GTతో మ్యాచులో RR బ్యాటర్ పరాగ్ దురదృష్టకర రీతిలో ఔటయ్యారు. ఖేజ్రోలియా వేసిన బంతిని పరాగ్ ఆడేందుకు ప్రయత్నించగా బాల్ వెళ్లి కీపర్ చేతిలో పడింది. అంపైర్ ఔట్ ఇవ్వగా, పరాగ్ రివ్యూ తీసుకున్నారు. బ్యాట్ నేలను తాకిన సమయంలోనే బ్యాటుకు బాల్ క్లోజ్‌గా కనిపించింది. స్పైక్ రావడంతో థర్డ్ అంపైర్ ఔటిచ్చారు. అయితే ఇది నాటౌట్ అని, స్పైక్ వచ్చినప్పుడు బాల్ నీడ బ్యాటుపై కనిపిస్తోందని RR ఫ్యాన్స్ అంటున్నారు.
News April 9, 2025
ఫేస్‌బుక్, మెసెంజర్‌లోనూ టీన్ అకౌంట్స్!

టీనేజర్ల భద్రత కోసం Instagramలో టీన్ అకౌంట్స్ ఫీచర్‌ను తీసుకొచ్చిన Meta, ఇప్పుడు దీనిని ఫేస్‌బుక్, మెసెంజర్‌కూ విస్తరించనుంది. తొలుత ఇది USA, UK, ఆస్ట్రేలియా, కెనడాలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ వల్ల 13-18 ఏళ్ల వయసున్న వారి ఖాతాలు తల్లిదండ్రుల నియంత్రణలో ఉంటాయి. తాజాగా టీన్ ఖాతాలకు ఇన్‌స్టా లైవ్ వీడియోస్ చూడటం/చేయడాన్ని నిషేధించింది. అలాగే న్యూడ్ కంటెంట్‌ను ఫిల్టర్ చేస్తోంది.
News April 9, 2025
ప్రపంచంలో అత్యంత విలువైన ఎయిర్‌లైన్ కంపెనీగా ‘ఇండిగో’

ఇండియాలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ అయిన ‘ఇండిగో’ అరుదైన ఘనత సాధించింది. మార్కెట్ క్యాపిటల్ ప్రకారం ప్రపంచంలో అత్యంత విలువైన ఎయిర్‌లైన్ కంపెనీగా అవతరించింది. ఈ క్రమంలో అమెరికాకు చెందిన డెల్టా ఎయిర్‌లైన్స్‌ను ఇండిగో అధిగమించింది. ఇండిగో షేర్ ప్రైస్ ఇవాళ రూ.5,265కు చేరడంతో మార్కెట్ క్యాపిటల్ 23.24 బిలియన్ డాలర్లకు ఎగబాకింది. కాసేపటికి 23.16 బి.డా.కు తగ్గడంతో డెల్టా మళ్లీ టాప్ ప్లేసుకు వెళ్లింది.