News April 2, 2025
మెట్‌పల్లి : పసుపు క్వింటాల్ @14,669

మెట్‌పల్లి మార్కెట్‌లో నేటి పసుపు భారీగా పెరిగాయి. నేడు పసుపు కాడి గరిష్ఠ రూ. 14,669, కనిష్ఠ రూ. 9,099; పసుపు గోళం గరిష్ఠ రూ. 13,695, కనిష్ఠ రూ. 9,000; పసుపు చూర గరిష్ఠ రూ. 12,911, కనిష్ఠ రూ. 9,033 లుగా పలికాయని మార్కెట్ కార్యదర్శి తెలిపారు. ఈ రోజు మొత్తం 1769 క్వింటాళ్ల పసుపు కొనుగోళ్లు జరిగాయని పేర్కొన్నారు. కాగా ఈ సీజన్ ప్రారంభంలో పసుపు క్వింటాల్ గరిష్ఠ ధరలు రూ.10-11వేలుగా పలికాయి.
Similar News
News September 17, 2025
2.83 కోట్ల చేప పిల్లల విడుదలే లక్ష్యం: కోదండ రెడ్డి

కామారెడ్డి జిల్లాలోని 768 చెరువులలో 100% సబ్సిడీపై 2.83 కోట్ల చేప పిల్లలను విడుదల చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా పాల్గొన్న ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మత్స్యకారుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.
News September 17, 2025
ఓంకారం ఓ ఆరోగ్య సంజీవని

ఓంకారం కేవలం ఆధ్యాత్మిక సాధన మాత్రమే కాదు. ఇది ఓ సంపూర్ణ ఆరోగ్య సంజీవని. నాభి నుంచి పలికే ఈ లయబద్ధమైన శబ్దం శరీరంలోని ప్రతి అణువునూ ఉత్తేజపరుస్తుంది. దీని పఠనం రక్తపోటును తగ్గించి, గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇది ఊపిరితిత్తుల పనితీరును, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళనలను తొలగించి, అపారమైన ప్రశాంతతను అందిస్తుంది. ఓంకారం మనసు, శరీరం, ఆత్మల ఏకీకరణకు ఓ శక్తిమంతమైన సాధనం.
News September 17, 2025
కుమార స్వామి, సుబ్రహ్మణ్య స్వామి ఒకరేనా?

సుబ్రహ్మణ్య స్వామి, కుమార స్వామి వేర్వేరు కాదు. ఆయన శివ పార్వతుల కుమారుడు. గణపతి, అయ్యప్పలకి సోదరుడు. శివుడి కుమారుడు కాబట్టి కుమారస్వామి అనే పేరొచ్చింది. ఆయణ్నే సుబ్రహ్మణ్య స్వామి, కార్తికేయుడు, షణ్ముఖుడు, మురుగన్ వంటి పేర్లతో కూడా పిలుస్తారు. ఆయనను దేవతల సైన్యాధిపతిగా, జ్ఞానానికి, యుద్ధానికి దేవుడిగా పూజిస్తారు. ఆరు ముఖాలు, పన్నెండు చేతులతో దర్శనమిచ్చే ఆయన ఆధ్యాత్మిక శక్తికి, పవిత్రతకు ప్రతీక.