News April 2, 2025
ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

TG: రాష్ట్రవ్యాప్తంగా 45,548 మంది ఆయిల్ పామ్ రైతుల ఖాతాల్లో ప్రత్యేక సబ్సిడీ డబ్బులను జమ చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇందుకోసం మొత్తం ₹72crను విడుదల చేశామన్నారు. సబ్సిడీ కింద ప్రభుత్వం ఎకరాకు ₹50వేలకు పైగా అందిస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 2.34 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు అవుతోంది. 2023లో మార్చిలో టన్ను గెల ధర ₹14,174గా ఉండగా, ప్రస్తుతం ₹21,000కు చేరిందని మంత్రి తెలిపారు.
Similar News
News April 4, 2025
300 కాదు.. సగం కూడా కష్టమే!

IPL-2025: 300 లోడింగ్. SRH ఆడే ప్రతి మ్యాచుకు ముందు అభిమానుల ఆశ ఇది. 300 సంగతి పక్కన పెడితే అందులో సగం కూడా చేయలేకపోతోంది సన్‌రైజర్స్. ఉప్పల్ స్టేడియంలో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించడంతో అక్కడ భారీగా పరుగులు చేస్తున్నారు. మిగతా స్టేడియాల్లో పిచ్, పరిస్థితులను అంచనా వేయకుండా బ్యాట్ ఊపడమే పనిగా పెట్టుకున్నారు. ఫలితంగా ఓపెనర్లు తొలి ఓవర్లలోనే ఔట్ అవుతుండటంతో బ్యాటింగ్ కుప్పకూలుతోంది.
News April 4, 2025
GET READY: మరో రెండు రోజుల్లో..

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. మరో రెండు రోజుల్లో ఫస్ట్ షాట్ రిలీజ్ చేయనున్నట్లు మూవీ టీమ్ ట్వీట్ చేసింది. ఈ విషయం తెలుపుతూ కొత్త పోస్టర్‌ను పంచుకుంది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
News April 4, 2025
ట్రంప్ టారిఫ్‌ల ఎఫెక్ట్.. పెరగనున్న ఐఫోన్ ధరలు?

ట్రంప్ ప్రతీకార టారిఫ్‌ల వల్ల ఐఫోన్ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ల ప్రొడక్షన్ ప్రధానంగా చైనాలో జరుగుతోంది. ఆ దేశ ఉత్పత్తులపై US భారీగా టారిఫ్‌లు విధించింది. ఫలితంగా ఐఫోన్ ధరలు 30-40% వరకు పెరగనున్నాయి. ప్రధాన మార్కెట్లలో ఇప్పటికే ఐఫోన్ విక్రయాలు పడిపోగా, తాజా పరిస్థితుల్లో అమ్మకాలు మరింత పతనం కానున్నాయి. ఫలితంగా చైనా బయట ప్రొడక్షన్ జరిగే శామ్‌సంగ్ తదితర మొబైళ్ల కంపెనీలు లాభపడనున్నాయి.