News April 2, 2025
విజయవాడలో రూ.252 కోట్ల పన్ను వసూలు

విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ (VMC)లో రికార్డు స్థాయిలో ఆస్తి పన్ను వసూలైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.252 కోట్ల ఆస్తి పన్ను వసూలైనట్లు బుధవారం వీఎంసీ వెల్లడించింది. నగరపాలక సంస్థకు గతంలో ఎన్నడూ లేనంతగా పన్నులు వసూలైనట్లు మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. అనంతరం వీఎంసీ రెవెన్యూ డిప్యూటీ కమిషనర్ సత్యవతిని మేయర్ అభినందించారు.
Similar News
News January 17, 2026
ఇన్సూరెన్స్ తీసుకునే ముందు ఇవి గుర్తించుకోండి

ప్రతి ఒక్కరికీ ఇన్సూరెన్స్ అవసరమే అయినా, సరైన అవగాహన లేకుంటే నష్టమే వస్తుంది. పాలసీ తీసుకునే ముందు వివిధ కంపెనీల ఆఫర్లను కంపేర్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పాలసీ నిబంధనలను పూర్తిగా చదవాలని, క్లెయిమ్ ప్రక్రియ వేగంగా జరిగే కంపెనీలను ఎంచుకోవాలని అంటున్నారు. భవిష్యత్ అవసరాలను అంచనా వేసి రైడర్లను తీసుకుంటే మరింత బాగుంటుంది.
News January 17, 2026
ఖమ్మం: మేడారం చెంతకు RTC బస్సులు.. టికెట్ ధరలు ఇవే!

సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర-2026 సందర్భంగా భక్తుల కోసం TGSRTC అధికారులు ప్రత్యేక బస్సు ఛార్జీలను ప్రకటించారు. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సుల ధరల పట్టికను విడుదల చేశారు. ఖమ్మం నుంచి రూ.480, కొత్తగూడెం- రూ.350, పాల్వంచ- రూ.310, మణుగూరు- రూ.210, భద్రాచలం- రూ.300, ఇల్లందు- రూ.400, ఇల్లందు వయా గుండాల- రూ.270గా ఖరారు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా బస్సులను నడుపుతామని చెప్పారు.
News January 17, 2026
మళ్లీ చెప్పున్నా.. జాగ్రత్త: కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ

ప్రభుత్వ పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు SMలో ఫేక్ లింకులు పంపి మోసం చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలను డీఐజీ, కర్నూలు ఇన్‌ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. పీఎం కిసాన్, ముద్ర లోన్స్, సూర్యఘర్, అమ్మఒడి వంటి పథకాల పేరుతో వచ్చే లింకులను క్లిక్ చేయవద్దన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పవద్దన్నారు. అనుమానాస్పద కాల్స్, లింకులు వస్తే 1930కు ఫోన్ చేయాలన్నారు.


