News April 2, 2025

స్టేట్‌ టాప్‌‌గా కామారెడ్డి ఆర్టీఏ

image

రెవెన్యూ వసూళ్లలో కామారెడ్డి ఆర్టీఏ రాష్ట్రంలోనే టాప్‌లో నిలిచిందని డీటీఓ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం జిల్లా కార్యాలయంలో కేక్‌ కట్‌ చేశారు. గతేడాది లక్ష్యం రూ.63 కోట్లు ఉండగా, ఈ సారి రూ.73 కోట్లకు రూ.68.19 కోట్లు (92.4%) వసూలు చేసినట్లు పేర్కొన్నారు. ఇందులో సిబ్బంది ప్రతి ఒక్కరి పాత్ర ఉందన్నారు.

Similar News

News April 9, 2025

ముస్లాపూర్‌లో వ్యక్తి మృతి.. పోలీసులకు ఫిర్యాదు 

image

అల్లదుర్గం మండలం ముస్లాపూర్ గ్రామానికి చెందిన నాయకిని సురేశ్ తన స్నేహితులతో కలిసి గ్రామ శివారులోని కుంటలో ఎద్దులను కడగడానికి వెళ్లారు. ప్రమాదపుశాత్తు సురేష్ నీట మునిగినట్లు స్నేహితులు గ్రామస్తులకు తెలిపారు. గ్రామస్తులు అతడిని బయటకి తీసి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. కొడుకు మృతి పట్ల అనుమానం ఉందని తండ్రి నర్సింలు పోలీసులకు పిర్యాదు చేసారు. సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 9, 2025

భానుడి ప్రతాపం.. ఆ మండలంలోనే టాప్.!

image

ఖమ్మం జిల్లాలో మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అత్యధికంగా ముదిగొండ (పమ్మి)లో 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపారు. అటు వైరా, నేలకొండపల్లిలో 40.3, ఖమ్మం(U) ఖానాపురం పీఎస్ లో 40.1, ఖమ్మం (R) పల్లెగూడెం, చింతకాని, మధిరలో 39.9, పెనుబల్లిలో 39.4, రఘునాథపాలెం (పంగిడి)లో 39.1, ఏన్కూరులో 38.6, తిరుమలాయపాలెంలో 38.4, కొణిజర్లలో 37.7 వైరాలో 37.2 నమోదైంది.

News April 9, 2025

ఇచ్చోడ: ఇంట్లో ఉరేసుకొని బాలిక మృతి

image

ఇచ్చోడ మండలంలో ఉరి వేసుకొని చనిపోయిన ఘటన జరిగింది. ఎస్సై తిరుపతి వివరాల ప్రకారం. ముఖరా(బి)కి చెందిన రఫీ గత కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ సభ్యులతో మద్యం తాగి వచ్చి రోజు గొడవ పడేవాడు. దీంతో మనస్థాపానికి గురైన కూతురు షేక్ ఫిర్దోసి(16) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. తల్లి జాబీనాబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

error: Content is protected !!