News April 2, 2025

నిజామాబాద్ జిల్లా BRS నేతలతో KCR సమావేశం

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా BRS ముఖ్య నేతలతో KCR ఎర్రవల్లిలో సమావేశమయ్యారు. BRS రజతోత్సవ మహాసభ ఏర్పాట్ల నేపథ్యంలో ఆయన సమావేశమై పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల గుప్త, గంప గోవర్ధన్, జాజుల సురేందర్, హనుమంత్ షిండే, NZB జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవన్ రెడ్డి, KMR జిల్లా పార్టీ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు.

Similar News

News January 8, 2026

NZB: ఈవీఎం గోడౌన్‌‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అగ్ని మాపక అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

News January 8, 2026

నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

image

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.

News January 8, 2026

NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

image

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్‌కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.