News April 2, 2025

స్పాట్ వాల్యుయేషన్‌కు 683మంది: అల్లూరి DEO

image

అల్లూరి జిల్లా పాడేరు సమీపంలో తలార్ సింగ్ ఉన్నత పాఠశాలలో రేపటి నుంచి పదో తరగతి పేపర్ల స్పాట్ వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందని DEO బ్రహ్మాజీరావు బుధవారం తెలిపారు. పాడేరులో స్పాట్ నిర్వహణపై అధికారులతో సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. 75 మంది చీఫ్ ఎక్సమినర్స్, 450మంది అసిస్టెంట్ ఎక్సమినర్స్, 150మంది స్పెషల్ అసిస్టెంట్స్‌తో పాటు మొత్తం 683 మంది సిబ్బందిని నియమించామని తెలిపారు.

Similar News

News November 7, 2025

ASF: ‘సిబ్బంది శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి’

image

ASF డివిజన్‌లోని సిబ్బందికి అందిస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఆడెపు భాస్కర్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ రైతు వేదికలో మహిళా శిశు సంక్షేమ శాఖ, యూనిసెఫ్ సంయుక్త ఆధ్వర్యంలో ASF డివిజన్ లోని ఐసిడిఎస్, వైద్య సిబ్బందికి ఏర్పాటు చేసిన ఎస్‌ఎస్‌ఎఫ్‌పీ రీ-ఓరియంటేషన్ శిక్షణ తరగతులకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి సీతారాంలతో కలిసి హాజరయ్యారు.

News November 7, 2025

యాదగిరిగుట్ట ఈవోగా వెంకట్రావుకు బాధ్యతలు

image

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఈవోగా వెంకట్రావు ఈరోజు తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఆయన 43 రోజుల వ్యక్తిగత సెలవుల అనంతరం తిరిగి విధుల్లో చేరారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఆలయం, క్యూలైన్లు, మాడవీధులు, శివాలయం, పుష్కరిణి, ప్రసాద విక్రయాల విభాగాలు సహా అన్ని పరిసర ప్రాంతాలను పరిశీలించారు.

News November 7, 2025

కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

image

TG: మాజీ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఆసక్తికర పోస్ట్ పెట్టారు. గాడిద ఫొటోపై ‘గాడిద నీపై అరిస్తే.. నువ్వు దానిపై అరవకు’ అని ఉన్న కొటేషన్‌ను షేర్ చేశారు. దీనికి ‘If you know, you know’ అని క్యాప్షన్ పెట్టి స్మైలింగ్ ఎమోజీని జోడించారు. ఇవాళ ప్రెస్‌మీట్‌లో తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సీఎం <<18226951>>రేవంత్‌కు<<>> పరోక్ష కౌంటర్‌గానే కేటీఆర్ ఈ ట్వీట్ చేశారని BRS వర్గాలంటున్నాయి.