News April 2, 2025
వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు: అమిత్ షా

వక్ఫ్ బిల్లుతో ముస్లింలకు మేలు జరుగుతుందని అమిత్‌షా స్పష్టం చేశారు. దీని ద్వారా వక్ఫ్ ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేయవచ్చన్నారు. ఈ బిల్లును చర్చి బోర్డులు కూడా సమర్థిస్తున్నాయని, ఇది అవినీతికి తప్ప ఏ మతానికి వ్యతిరేకం కాదని తేల్చి చెప్పారు. దీని ద్వారా మతాల మధ్య ఘర్షణ సృష్టించాలనే ఆలోచన తమకు లేదని ఆయన వివరించారు. ఈ బిల్లును తాము రాజ్యాంగబద్ధంగానే రూపొందించామని వెల్లడించారు.
Similar News
News January 30, 2026
కాని వేళకి కందులు గుగ్గిళ్లయినట్లు

సాధారణంగా ఆకలిగా ఉన్నప్పుడు లేదా ఏదైనా పండుగ సమయంలో గుగ్గిళ్లు దొరికితే చాలా సంతోషిస్తాం. కానీ, అసలు అవసరం లేని సమయంలో, కడుపు నిండుగా ఉన్నప్పుడో, ప్రాధాన్యత లేనప్పుడో అవి ఎన్ని దొరికినా ప్రయోజనం ఉండదు. అలాగే ఏదైనా సహాయం అత్యవసరంగా కావాల్సినప్పుడు అందకుండా, అంతా అయిపోయాక అందితే వ్యర్థమని, దాని వల్ల ఎలాంటి లాభం ఉండదని చెప్పడానికి ఈ సామెతను ఉపయోగిస్తారు.
News January 30, 2026
భూమి బయట సముద్రం ఉంటుందా?

భూమ్మీద సముద్రాలుంటాయి. మరి హిరణ్యాక్షుడు భూమిని సంద్రంలో ఎలా దాచాడు? ఈ సందేహం చాలా మందికి వచ్చి ఉంటుంది. అయితే పురాణాల ప్రకారం.. ఈ విశ్వంలో సగం వరకు ‘గర్భోదక జలాలు’ ఉంటాయి. ఇందులో అనంతమైన నీరు ఉంటుంది. హిరణ్యాక్షుడు భూమిని ఈ విశ్వ జలరాశి అడుగునే పడేశాడు. ఓ నీటి గిన్నెలో బంతి మునిగినట్లుగా, భూగోళం ఆ సంద్రంలో మునిగింది. అప్పుడు భగవంతుడు వరాహ రూపంలో ఆ జలాల లోపలికి వెళ్లి, భూమిని రక్షించాడు.
News January 30, 2026
భూమిని కాపాడేందుకు వరాహ రూపమే ఎందుకు? (1/2)

గ్రహాలన్నీ ఓ నియమ కక్ష్యలో తిరుగుతుంటాయి. అయితే హిరణ్యాక్షుడు భూకక్ష్యకు విఘాతం కలిగించడంతో అది విశ్వ గర్భోదక జలాల్లో మునిగిపోయింది. నీటి అడుగున ఉన్న భూమిని రక్షించి, తిరిగి అదే స్థానంలో నిలపడానికి జలచర సామర్థ్యం గల వరాహ రూపం అనువైనది. అందుకే విష్ణువు ఆ అవతారమెత్తాడు. తన కొమ్ముదంతంతో భూమిని ఉద్ధరించి, హిరణ్యాక్షుణ్ని సంహరించాడు. ఇది కేవలం లీల మాత్రమే కాదు. సృష్టి సమతుల్యతను కాపాడే దివ్య చర్య.


