News April 2, 2025

రెవెన్యూ సేవలలో జాప్యం వద్దు: అనకాపల్లి కలెక్టర్ 

image

రెవెన్యూ సేవలలో జాప్యం ఉండకూడదని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ అన్నారు. కలెక్టరేట్ నుంచి బుధవారం రెవెన్యూ శాఖకు సంబంధించిన రీసర్వే మ్యూటేషన్లు, ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ, నీటి తీరవా వసూళ్లు తదితర అంశాలపై తహశీల్దారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రెవెన్యూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి సకాలంలో చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేయాలన్నారు.

Similar News

News April 4, 2025

భూంపల్లి: అసహజ లైంగిక వీడియో షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

image

అసహజ లైంగిక (మైనర్స్) వీడియో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వ్యక్తిని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భూంపల్లి పీఎస్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి(22) గత కొన్ని రోజుల క్రితం తన ఫోన్ ద్వారా మైనర్ సెక్స్ వీడియో చూస్తూ.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సైబర్ సెక్యూరిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేశామన్నారు.

News April 4, 2025

SRHకు వెంకటేశ్ అయ్యర్ కౌంటర్?

image

క్రికెట్‌లో దూకుడు అంటే ప్రతీ బాల్‌ను బాదడం కాదని, పరిస్థితులకు తగ్గట్లు ఆడటమని KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ అన్నారు. ‘బాగా ఆడినప్పుడు 250, ఆడనప్పుడు 70 రన్స్‌కు పరిమితమవ్వాలని మా జట్టు కోరుకోదు. కండీషన్స్‌ బట్టి అంచనా స్కోరుకు మరో 20 రన్స్ అదనంగా చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు SRHను ఉద్దేశించినవేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 4, 2025

మార్కాపురంలో యువకుడు ఆత్మహత్య

image

మార్కాపురం కాలేజీ రోడ్డులోని జాకీ షోరూమ్ లో పనిచేస్తున్న మహేశ్ అనే యువకుడు గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆళ్లగడ్డకు చెందిన మహేశ్ జీవనోపాధి కోసం కొంతకాలం క్రితం మార్కాపురం వచ్చాడని స్థానికులు తెలిపారు. నమ్మిన వారందరూ మోసం చేశారని జీవితం మీద విరక్తితో చనిపోతున్నట్లు సూసైడ్ నోట్ రాశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

error: Content is protected !!