News April 2, 2025
RBI డిప్యూటీ గవర్నర్‌గా పూనమ్ గుప్తా

దశాబ్దకాలం తర్వాత RBI డిప్యూటీ గవర్నర్‌గా మహిళ నియమితులయ్యారు. ప్రముఖ ఎకానమిస్ట్ పూనమ్ గుప్తాను నియమిస్తూ కేంద్రం ప్రకటన విడుదల చేసింది. వరల్డ్ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధిలో 20 ఏళ్లపాటు పనిచేసిన సుదీర్ఘ అనుభవం ఆమె సొంతం. భారత ప్రభుత్వ అడ్వైజర్‌గా, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకానమిక్ రీసెర్చ్(NCAER) డైరెక్టర్‌గానూ సేవలందించారు. RBI మానిటరీ పాలసీ కమిటీలో పూనమ్ చేరనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 7, 2025
ఆరు రోజుల్లో 1.27 కోట్ల మందికి సన్నబియ్యం

TG: రాష్ట్రంలో సన్నబియ్యం రేషన్ పంపిణీ కొనసాగుతోంది. ఇప్పటివరకు 1.27 కోట్ల మంది సన్నబియ్యం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 90.42 లక్షల రేషన్ కార్డులుండగా ఏప్రిల్‌లో 42 లక్షల కార్డులపై లబ్ధిదారులు బియ్యం తీసుకున్నారు. ఈ ఆరు రోజుల్లోనే 8.75 లక్షల క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. పలు చోట్ల రవాణా, సాంకేతిక సమస్యలతో పంపిణీ నెమ్మదిగా సాగుతున్నా ఈ నెల 15వరకు పూర్తవుతుందని అధికారులు పేర్కొన్నారు.
News April 7, 2025
VIRAL: జీనియస్ డైరెక్టర్‌తో యంగ్ టైగర్

యంగ్ టైగర్ NTR, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ ఇద్దరూ తాజాగా మీట్ అయ్యారు. ఈ సందర్భంగా వారు హగ్ చేసుకున్న ఫొటోను సుకుమార్ భార్య తబిత ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘తారక్‌కి ప్రేమతో’ అన్న క్యాప్షన్ ఇచ్చారు. రీపోస్ట్ చేసిన NTR, ‘నన్ను ఎప్పుడూ వెంటాడే ఎమోషన్ సుకుమార్’ అని రాసుకొచ్చారు. దీంతో వీరి కాంబోలో మరో మూవీ రాబోతుందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ‘నాన్నకు ప్రేమతో’ మూవీకి వీరు కలిసి పనిచేశారు.
News April 7, 2025
ఎకరానికి రూ.2 కోట్ల డిమాండ్.. కష్టంగా ఎయిర్‌పోర్టు భూసేకరణ!

TG: వరంగల్ జిల్లా మూమునూరు ఎయిర్‌పోర్టుకు భూసేకరణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే అక్కడి భూముల రేట్లు అమాంతం పెరిగాయి. ప్రభుత్వం రూ.40 లక్షలు ఇస్తామంటుండగా స్థానిక రైతులు ఎకరానికి రూ.2 కోట్లు డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 253 ఎకరాల భూమికోసం ప్రభుత్వం రూ.205 కోట్లు కేటాయించింది. కాగా.. ఎయిర్‌పోర్టు రాకతో కొత్త పరిశ్రమలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి.