News April 2, 2025

వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

image

వైల్డ్‌లైఫ్ చీఫ్ వార్డెన్ మెరూ‌ను ఆర్‌ఎస్. ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ ప్రతినిధి బృందం అరణ్య భవన్‌లో కలిశారు. హెచ్సీయూ పరిధిలో వివిధ జంతు- వృక్ష జాతుల మనుగడకు హాని కలిగించే చర్యలను తక్షణమే అడ్డుకోవాలని వినతిపత్రం అందజేశారు. అటవీ, పర్యావరణ పరిరక్షణ చట్టాలను కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల్లో రాష్ట్ర ప్రభుత్వం యథేచ్ఛగా ఉల్లంఘిస్తుండటంపై ఫిర్యాదు చేశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Similar News

News July 11, 2025

మేడ్చల్: ‘రేషన్ కార్డులకు ఈ కెవైసీ పూర్తి చేయాలి’

image

మేడ్చల్ జిల్లాలోని రేషన్ కార్డు లబ్ధిదారులు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం E-KYC పూర్తి చేయాలని జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీనివాస్‌రెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో మొత్తం 5,37,810 కార్డుల్లోని 18,65,353 మంది లబ్ధిదారులకుగానూ 13,19,111 (70.72%) లబ్ధిదారులు మాత్రమే E-KYC పూర్తి చేసుకున్నారని, మిగిలిన 5,46,242 (29.28%) లబ్ధిదారులు E-KYC పూర్తి చేసుకోవాలని సూచించారు.

News July 11, 2025

రేపు మహాకాళి టెంపుల్‌కు గవర్నర్, మంత్రి రాక

image

సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని బోనాల జాతర నేపథ్యంలో మహాకాళి దేవస్థానాన్ని రేపు శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, HYD ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించనున్నట్లు దేవస్థాన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జీ.మనోహర్‌రెడ్డి తెలిపారు. రేపు ఉ.9గంటలకు వీరు మహాకాళి అమ్మవార్లను దర్శించుకుంటారన్నారు. ఈ సందర్భంగా గవర్నర్‌తో పాటు మంత్రి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేయనున్నారు.

News July 11, 2025

బీసీ గురుకుల పాఠశాల్లో సీట్ల సంఖ్య పెంచాలి: కృష్ణయ్య

image

బీసీ గురుకుల పాఠశాలల్లో తరగతి గదులు, సీట్లు పెంచాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ గురుకుల పాఠశాలల్లో వేల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారని దీంతో విద్యార్థులు సీట్లు దొరక్క అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన పేర్కొన్నారు. సీట్ల సంఖ్యను పెంచాలని కోరుతూ ఆయన గురువారం సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.