News April 2, 2025

జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం

image

సూర్యాపేట కలెక్టరేట్‌లో మున్సిపల్ కమిషనర్లు ఎంపీడీవోలు, డీపీఎంలు, ఏపీవోలు, అధికారులతో రాజీవ్ యువ వికాస పథకం అమలు, వివిధ అంశాలపై బుధవారం కలెక్టర్ తేజ్ నందలాల్ పవార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా మునగాల మండలంలోని ఎంపీఓ ధార శ్రీనివాసరావు మృతి పట్ల కలెక్టర్ సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం అధికారులకు పలు సూచలు చేశారు.

Similar News

News November 17, 2025

రేపు కర్నూలులో ట్రైలర్ రిలీజ్

image

హీరో రామ్ పోతినేని నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ చిత్రం నుంచి ఇప్పటికే రిలీజైన టీజర్‌, సాంగ్స్‌‌కు అభిమానుల నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. ఇక మూవీ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా రేపు కర్నూలులో ట్రైలర్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నగరంలో రామ్ పోతినేని, హీరోయిన్ భాగ్యశ్రీ ఫ్యాన్స్ మధ్య ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు. 27న మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది.

News November 17, 2025

అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు(1/2)

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.

News November 17, 2025

iBOMMA రవి భార్య వల్ల దొరికిపోయాడా? క్లారిటీ ఇదే!

image

iBOMMA నిర్వాహకుడు రవి భార్యతో విడాకులు తీసుకునేందుకు వచ్చి పోలీసులకు దొరికిపోయాడని ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో నిజం లేదు. అతడికి ఐదేళ్ల క్రితమే విడాకులయ్యాయి. ఇటీవల ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి చెల్లింపుల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేయగా ఐపీ అడ్రస్ లభించింది. అది మూసాపేట్‌లోని విస్టా అపార్ట్‌మెంట్స్ అని గుర్తించి నిఘా ఉంచారు. 2 రోజుల క్రితం అతడు ఫ్రాన్స్ నుంచి తిరిగి రాగానే అరెస్టు చేశారు.