News April 2, 2025

కర్నూలు-విజయవాడ మధ్య విమాన సర్వీసులకై విజ్ఞప్తి

image

AP: కర్నూలు నుంచి విజయవాడకు విమాన సర్వీసులు నడపాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కోరారు. ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేయగా, ఆయన సానుకూలంగా స్పందించారు. ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌లో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. విమాన సర్వీసులూ అందుబాటులోకి వస్తే పారిశ్రామికవేత్తల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందన్నారు.

Similar News

News April 4, 2025

SRHకు వెంకటేశ్ అయ్యర్ కౌంటర్?

image

క్రికెట్‌లో దూకుడు అంటే ప్రతీ బాల్‌ను బాదడం కాదని, పరిస్థితులకు తగ్గట్లు ఆడటమని KKR ప్లేయర్ వెంకటేశ్ అయ్యర్ అన్నారు. ‘బాగా ఆడినప్పుడు 250, ఆడనప్పుడు 70 రన్స్‌కు పరిమితమవ్వాలని మా జట్టు కోరుకోదు. కండీషన్స్‌ బట్టి అంచనా స్కోరుకు మరో 20 రన్స్ అదనంగా చేసేందుకు ప్రయత్నిస్తాం’ అని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలు SRHను ఉద్దేశించినవేనని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News April 4, 2025

ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

image

TG: ఇంటర్ ఫలితాలను ఈ నెల చివరి వారంలోగా రిలీజ్ చేసేందుకు ఇంటర్ బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల 10వ తేదీకి పూర్తి కానుంది. కాగా, 35 మార్కులు రాని విద్యార్థులు నష్టపోకుండా వారి జవాబు పత్రాలను చీఫ్ ఎగ్జామినర్, సబ్జెక్ట్ నిపుణులతో ర్యాండమ్‌గా వాల్యుయేషన్ చేయిస్తున్నట్లు బోర్డు వర్గాలు తెలిపాయి. అటు ఏపీలో ఈ నెల 15లోపు ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

News April 4, 2025

బుచ్చిబాబుకు రామ్ చరణ్ స్పెషల్ గిఫ్ట్

image

డైరెక్టర్ బుచ్చిబాబుకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక బహుమతి ఇచ్చారు. ఇటీవల 40వ బర్త్ డే జరుపుకున్న చరణ్.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న ఆంజనేయస్వామి పాదుకలను డైరెక్టర్‌కు బహుమతిగా పంపారు. గిఫ్ట్ అందుకున్న బుచ్చిబాబు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్‌తో ‘పెద్ది’ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

error: Content is protected !!