News April 2, 2025

HCU భూముల అమ్మకం ఆపాలి: MLC అంజిరెడ్డి

image

HCU భూముల అమ్మకం నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని పట్టభద్రుల MLC అంజిరెడ్డి డిమాండ్ చేశారు. HCU భూముల అమ్మకానికి వ్యతిరేకంగా ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద పార్టీ నాయకులతో కలిసి ధర్నాలో అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు. HCUలో 400 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అడవి హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ సిలిండర్ లాంటిదని అలాంటి భూమి అమ్మడం ద్వారా హైదరాబాద్‌లో అనేక అనర్థాలు, కాలుష్యాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు.

Similar News

News December 28, 2025

డ్రెస్సింగ్‌పై నిధి అగర్వాల్ ఏమన్నారంటే?

image

హీరోయిన్ నిధి అగర్వాల్ #ASKNIDHI అంటూ ట్విట్టర్‌లో అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పారు. ఇందులో భాగంగా ఒకరు ‘ఏ కాస్ట్యూమ్/అవుట్ ఫిట్ ధరించడం మీకు ఇష్టం?’ అని అడిగారు. అందుకు ‘నన్, ఏంజెల్ కాస్ట్యూమ్ ఇష్టం’ అంటూ నిధి చెప్పారు. ఆమె రాజాసాబ్ చిత్రంలో నన్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. అలాగే హీరోయిన్స్ వస్త్రధారణపై జరుగుతున్న చర్చలో <<18661197>>నిధి<<>> పేరు హైలైట్ కావడంతో ఆమె ఇచ్చిన ఆన్సర్ SMలో వైరలవుతోంది.

News December 28, 2025

సోషల్ మీడియాలో తిరుపతి పోలీసుల జోరు

image

తిరుపతి జిల్లా పోలీసులు సోషల్ మీడియాలోనూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌లో తిరుపతి జిల్లా పోలీస్ శాఖ లక్షల మంది సబ్ స్క్రైబర్స్ పొందింది. ఫేస్‌బుక్‌లో 4.33 లక్షలు, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.01 లక్షలు, యూట్యూబ్‌లో 1.08 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.

News December 28, 2025

ప్రకాశం జిల్లా ఏపీటీఎఫ్ అధ్యక్షుడు ఈయనే.!

image

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నూతన కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నూతన జిల్లా అధ్యక్షుడిగా షేక్ నాయబ్ రసూల్, ప్రధాన కార్యదర్శిగా బాసం శేషారావులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాలో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.