News April 2, 2025

మహబూబ్‌నగర్: మంత్రి ధర్మేంద్రను కలిసిన మాజీ మంత్రి

image

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూవివాదంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బీఆర్ఎస్ మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ సర్కార్ విద్యార్థులపై దమనకాండ చేస్తోందని ఫిర్యాదు చేశారు. యూనివర్సిటీ భూములను కాపాడాలని, విద్యార్థులపై లాఠీఛార్జి చేశారన్నారు. వారికి న్యాయం చేయాలని వినతి పత్రం అందజేశారు.

Similar News

News January 14, 2026

ఈ గ్రామంలో సంక్రాంతి పండుగే జరపరు

image

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి హడావుడి మాములుగా ఉండదు. కానీ, అనంతపురం(D) పి.కొత్తపల్లి గ్రామంలో ఈ పండుగే చేయరు. ఈ మూడ్రోజులు ముగ్గులు వేయడం, ఇల్లు తుడవడం వంటి పనులేం చేయరు. విచిత్రమేంటంటే కొందరు స్నానాలు కూడా చేయరట. పూర్వం సంక్రాంతి సరుకుల కోసం సంతకు వెళ్లిన గ్రామస్తులు వరుసగా మరణించడంతో, ఈ పండుగ తమకు అరిష్టమని వారు నమ్ముతారు. అందుకే తరాలు మారినా నేటికీ అక్కడ పండుగ చేసుకోరు.

News January 14, 2026

GNT: కిటకిటలాడుతున్న సరస్ ప్రదర్శన ప్రాంగణం

image

గుంటూరులో జరుగుతున్న సరస్ మేళా-2026 అఖిల భారత డ్వాక్రా బజారుకు విశేమైన ఆదరణ లభిస్తోంది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో సందర్శకులు స్టాళ్లను సందర్శిస్తున్నారు. దేశ నలుమూలల నుంచి వచ్చిన స్టాల్స్ మాత్రమే కాకుండా సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ఉత్పత్తులతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆలరిస్తున్నాయని సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News January 14, 2026

చిత్తూరుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

image

తవణంపల్లి: తెల్లగుండ్లపల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణం వందలూరు గ్రామానికి చెందిన కే. బుజ్జమ్మ (45) భర్త మురుగయ్య‌తో కలిసి బైకుపై చిత్తూరుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మురుగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మురుగయ్యను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.