News April 2, 2025
మాకవరపాలెంలో రోడ్డు ప్రమాదం.. వార్డు సభ్యుడు మృతి

మాకవరపాలెం మండలంలో అవంతి కళాశాల ఎదురుగా బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో భీమ బోయినపాలెంకి చెందిన వార్డు సభ్యుడు లాలం మణిబాబు మృతి చెందాడు. మాకవరపాలెం నుంచి బైక్‌పై స్వగ్రామం వెళుతుండగా అవంతి కళాశాల వద్దకు వచ్చేసరికి కళాశాల లోపల నుంచి వస్తున్న బైక్ ఢీ కొట్టింది. దీంతో మణిబాబును నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News April 4, 2025
NZB: ఈజీ మనీ కోసం పెడదారి పట్టొద్దు: సీపీ

బెట్టింగ్ ఊబిలోకి వెళ్లి బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ గేమింగ్ యాక్ట్ ప్రకారం ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ అనేది మన రాష్ట్రంలో పూర్తిగా నిషేధమన్నారు. ఇన్‌ప్లూయెన్సర్లు చెప్పారని, సోషల్ మీడియాలో వచ్చిన లింక్‌లను క్లిక్ చేసి బెట్టింగ్ ఆడవద్దని హితవు పలికారు. ఈజీ మనీ కోసం పెడదారులు పట్టొదన్నారు.
News April 4, 2025
అనంతపురం: పెళ్లై 6 నెలలే.. అంతలోనే మృతి

పెళ్లై 6 నెలలు గడవకముందే వ్యక్తి మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గురువారం సాయంత్రం ఉరవకొండ మండలం రాకెట్ల PABR జలాశయంలో మునిగి కార్తీక్ (25) మృతి చెందాడు. తెలిసిన వారు పిలిస్తే జలాశయం వద్ద వ్యవసాయ మోటర్ దింపడానికి వెళ్ళాడు. జలాశయం లోపలికి వెళ్లిన తరువాత చేపల కోసం వేసిన వల చిక్కుకొని ప్రమాదవశాత్తు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 4, 2025
భూంపల్లి: అసహజ లైంగిక వీడియో షేర్ చేసిన వ్యక్తి అరెస్ట్

అసహజ లైంగిక (మైనర్స్) వీడియో సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేసిన వ్యక్తిని దుబ్బాక సీఐ శ్రీనివాస్ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భూంపల్లి పీఎస్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి(22) గత కొన్ని రోజుల క్రితం తన ఫోన్ ద్వారా మైనర్ సెక్స్ వీడియో చూస్తూ.. వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. సైబర్ సెక్యూరిటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో అరెస్ట్ చేశామన్నారు.