News April 2, 2025
NTR: అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం

ఎన్టఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామంలో ఈనెల 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి, ప్రజా వేదిక కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ లక్ష్మీశ జిల్లా అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి చంద్రబాబు పర్యటన విజయవంతం చేయాలన్నారు.
Similar News
News April 4, 2025
ట్రంప్ కామెంట్స్.. భారీగా పడిపోయిన ఫార్మా షేర్లు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు భారతీయ ఫార్మా షేర్లు భారీగా పడిపోతున్నాయి. త్వరలోనే ఫార్మా రంగంపై సుంకాలు మునుపెన్నడూ లేని విధంగా ఉంటాయని మీడియాతో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫార్మాను ప్రత్యేక కేటగిరీగా చూస్తున్నామని, త్వరలో టారిఫ్స్ విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో అరబిందో ఫార్మా, IPCA లేబరేటరీస్, లుపిన్, ఇతర డ్రగ్ మేకర్స్ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి.
News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు.. నలుగురు రాజీనామా

వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపినందుకు నిరసనగా నలుగురు నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటేయడంతో తాము మనస్తాపానికి గురయ్యామని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో తబ్రేజ్ సిద్ధిఖీ, మహమ్మద్ షానవాజ్, మహమ్మద్ ఖాసిమ్ అన్సారీ, రాజు నయ్యర్ ఉన్నారు.
News April 4, 2025
వికారాబాద్: పెద్దేముల్ హత్యకు గురైన యశోద వివరాలు

వికారాబాద్ జిల్లాలో సంచలనంగా మారిన ఓ మహిళ హత్య కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ నెల 2వ తేదీన పెద్దేముల్ మండల కేంద్రంలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. కాగా, ఆ మహిళ ఎవరు అనేది నిర్ధారించినట్లు ఎస్ఐ శ్రీధర్ రెడ్డి శుక్రవారం తెలిపారు. బొంరాస్‌పేట మండలంలోని చౌదర్‌పల్లి గ్రామానికి చెందిన ఈర్లపల్లి యశోదగా గుర్తించారు. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.