News April 2, 2025
బలహీన వర్గాలను ఐక్యం చేసిన పాపన్న: మంత్రి

బడుగు, బలహీన వర్గాలను ఐక్యం చేసిన పోరాటయోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి సందర్భంగా సంగారెడ్డిలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. మంత్రి మాట్లాడుతూ నేటి యువత విద్యార్థులు పాపన్నను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.
Similar News
News September 17, 2025
అమరావతి: అసైన్డ్ రైతులకు ఊరట

అమరావతి రాజధాని కోసం తమ అసైన్డ్ భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా ఇచ్చిన రైతులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. గతంలో రిటర్నబుల్ ప్లాట్లలో ‘అసైన్డ్’ అని పేర్కొనడంతో అవి అమ్ముడుపోవడం లేదని రైతులు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ నేపథ్యంలో, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ చట్టంలోని 9.24లోని కాలమ్ నంబర్ 7, రూల్ నంబర్ 11(4) క్లాజ్‌ను తొలగిస్తూ జీవో నంబర్ 187ను బుధవారం విడుదల చేసింది.
News September 17, 2025
‘రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రైతుల సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి చెప్పారు. కామారెడ్డి జిల్లాలోని 3,03,568 మంది రైతుల బ్యాంకు ఖాతాలలో రూ. 305.98 కోట్లు ‘ఇందిరమ్మ రైతు భరోసా’ కింద జమ చేశామని పేర్కొన్నారు. దీంతోపాటు, ప్రభుత్వం జిల్లాలో 1,96,554 మంది రైతులకు పంటల బీమా కల్పించిందని, ఇది ఆపత్కాలంలో రైతులకు అండగా ఉంటుందని తెలిపారు.
News September 17, 2025
గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు లైన్ క్లియర్

AP: విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో ఉత్సవ్ నిర్వహణకు అడ్డంకులు తొలగాయి. గొడుగుపేటలోని వేంకటేశ్వర స్వామి ఆలయ భూములను వాణిజ్య అవసరాలకు వినియోగించవద్దంటూ నిన్న సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిని సవాల్ చేస్తూ డివిజనల్ బెంచ్‌లో సొసైటీ ఫర్ వైబ్రంట్ విజయవాడ అప్పీల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ చేపట్టిన సీజే ధర్మాసనం సింగిల్ బెంచ్ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించింది.