News April 2, 2025
RTC ఉద్యోగుల పిల్లలకు ర్యాంకులు.. సజ్జనార్ సన్మానం

TG:గ్రూప్-1 ఫలితాల్లో ఉద్యోగాలు పొందిన TGSRTC ఉద్యోగుల పిల్లలను సంస్థ MD సజ్జనార్ సన్మానించారు. గ్రూప్-1 రిజల్ట్స్‌లో నారాయణపేట డిపోకు చెందిన కండక్టర్ శ్రీనివాస్ కుమార్తె వీణ 118వ ర్యాంక్, TI-2గా పనిచేస్తున్న వాహిద్ కుమార్తె ఫాహిమినా 126వ ర్యాంక్, వనపర్తి డిపోకు చెందిన కండక్టర్ పుష్పలత కుమారుడు రాఘవేందర్ 143వ ర్యాంకులు సాధించారు. RTC ఉద్యోగుల పిల్లలు రాణించడం చాలా సంతోషంగా ఉందని సజ్జనార్ అన్నారు.
Similar News
News April 4, 2025
వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు.. నలుగురు రాజీనామా

వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపినందుకు నిరసనగా నలుగురు నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటేయడంతో తాము మనస్తాపానికి గురయ్యామని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో తబ్రేజ్ సిద్ధిఖీ, మహమ్మద్ షానవాజ్, మహమ్మద్ ఖాసిమ్ అన్సారీ, రాజు నయ్యర్ ఉన్నారు.
News April 4, 2025
ధనవంతులు అయ్యేందుకు టిప్స్!

కొన్ని పద్ధతులు పాటిస్తే ధనవంతులు కావొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకే ఆదాయంతో మీరు ధనవంతులు కాలేరు. కచ్చితంగా రెండో ఆదాయం ఉండాల్సిందే. మీకు వచ్చిన ఆదాయంలో పొదుపు చేయగా మిగిలిన డబ్బును మాత్రమే ఖర్చు చేయాలి. ఏదో ఒక రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ప్రతీ రూపాయికీ లెక్క ఉండాలి. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ పొదుపు చేయాలి. ఆ తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది.
News April 4, 2025
అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా?: రాజా సింగ్

TG: హైదరాబాద్ స్థానిక సంస్థల BJP ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ పెద్దలు, అధిష్ఠానంపై మండిపడ్డారు. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో అభ్యర్థులు లేరా? అని ప్రశ్నించారు. అధిష్ఠానానికి సీనియర్లు, కార్యకర్తలు కనబడట్లేదా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. డా.ఎన్.గౌతమ్ రావును MLC అభ్యర్థిగా BJP బరిలో నిలిపిన విషయం తెలిసిందే.