News April 2, 2025

ఛత్రపతి శివాజీ 100శాతం లౌకికవాది: గడ్కరీ

image

ఛత్రపతి శివాజీ ఎన్నో యుద్ధాలు గెలిచారు కానీ ఎప్పుడూ ఏ మసీదునూ కూల్చలేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. ‘ఛత్రపతి శివాజీ నిజమైన పాలకుడికి, తండ్రికి ప్రతీక. ఆయన వందశాతం లౌకికవాది. చాలామంది పెద్ద నాయకులవ్వగానే కులం, మతం గురించి మాట్లాడుతుంటారు. అలా మాట్లాడటం సరికాదని నేను చాలామందిని హెచ్చరిస్తుంటాను’ అని తెలిపారు.

Similar News

News April 4, 2025

ట్రంప్ కామెంట్స్.. భారీగా పడిపోయిన ఫార్మా షేర్లు

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకాల దెబ్బకు భారతీయ ఫార్మా షేర్లు భారీగా పడిపోతున్నాయి. త్వరలోనే ఫార్మా రంగంపై సుంకాలు మునుపెన్నడూ లేని విధంగా ఉంటాయని మీడియాతో ట్రంప్ వ్యాఖ్యానించారు. ఫార్మాను ప్రత్యేక కేటగిరీగా చూస్తున్నామని, త్వరలో టారిఫ్స్ విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో అరబిందో ఫార్మా, IPCA లేబరేటరీస్, లుపిన్, ఇతర డ్రగ్ మేకర్స్ షేర్లు 10 శాతం వరకు పడిపోయాయి.

News April 4, 2025

వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు.. నలుగురు రాజీనామా

image

వక్ఫ్ బిల్లుకు జేడీయూ మద్దతు తెలిపినందుకు నిరసనగా నలుగురు నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉన్న ఈ బిల్లుకు జేడీయూ అనుకూలంగా ఓటేయడంతో తాము మనస్తాపానికి గురయ్యామని ఆ పార్టీ అధినేత నితీశ్ కుమార్‌కు లేఖ రాశారు. రాజీనామా చేసిన వారిలో తబ్రేజ్ సిద్ధిఖీ, మహమ్మద్ షానవాజ్, మహమ్మద్ ఖాసిమ్ అన్సారీ, రాజు నయ్యర్ ఉన్నారు.

News April 4, 2025

ధనవంతులు అయ్యేందుకు టిప్స్!

image

కొన్ని పద్ధతులు పాటిస్తే ధనవంతులు కావొచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఒకే ఆదాయంతో మీరు ధనవంతులు కాలేరు. కచ్చితంగా రెండో ఆదాయం ఉండాల్సిందే. మీకు వచ్చిన ఆదాయంలో పొదుపు చేయగా మిగిలిన డబ్బును మాత్రమే ఖర్చు చేయాలి. ఏదో ఒక రంగంలో పెట్టుబడులు పెడుతూ ఉండాలి. ప్రతీ రూపాయికీ లెక్క ఉండాలి. ఎక్కువ డబ్బు సంపాదిస్తే ఎక్కువ పొదుపు చేయాలి. ఆ తర్వాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది.

error: Content is protected !!