News April 3, 2025

మారుతీ కార్లు కొనేవారికి షాక్

image

ఏప్రిల్ 8 నుంచి కార్ల ధరలు పెంచుతున్నట్లు మారుతీ సుజుకీ ప్రకటించింది. మోడల్‌ను బట్టి రూ.2,500 నుంచి రూ.62,000 వరకు ఈ పెంపు ఉంటుందని తెలిపింది. ముడి సరకుల ధరలు, ఆపరేషనల్ కాస్ట్ పెరగడం, కార్లలో మెరుగైన ఫీచర్స్ ఇందుకు కారణమని తెలిపింది. మోడళ్లపై ధరల పెరుగుదల ఇలా ఉంది. SUV Fronx-Rs.2500, Dzire Tour S-Rs.3000, XL6, Ertiga-Rs.12,500, Wagon R-Rs.14000, Eeco van-Rs.22,500, SUV Grand Vitara-Rs.62,000.

Similar News

News April 4, 2025

నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్

image

AP: ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరికి చెందిన 298 మందికి మంత్రి లోకేశ్ శాశ్వత ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అని, కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువొస్తుందని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని ఆయన చెప్పారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవని తెలిపారు. భూగర్భ విద్యుత్, డ్రైనేజ్, గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడించారు.

News April 4, 2025

శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం: పొంగులేటి

image

TG: శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు. ధాన్యం తరుగు పెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామన్నారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు.

News April 4, 2025

ప్రధాని మోదీకి యూనస్ బహుమతి

image

బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ విజ్ఞప్తి మేరకు ప్రధాని మోదీ ఆయనతో బ్యాంకాక్‌లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఫొటో ఫ్రేమ్‌ను మోదీకి యూనస్ బహుమతిగా ఇచ్చారు. 2015లో 102వ సైన్స్ కాంగ్రెస్‌ సభలో యూనస్‌కు మోదీ గోల్డ్ మెడల్ బహూకరించారు. ఆ ఫొటోనే యూనస్ ఫ్రేమ్‌ చేయించి గిఫ్ట్‌గా ఇచ్చారు. కాగా.. ఇరు దేశాల మధ్య విభేదాల నేపథ్యంలో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.

error: Content is protected !!