News April 3, 2025

బెల్లంపల్లి: గ్రామీణ యువత క్రీడల్లో రాణించాలి: MLA

image

గ్రామీణ ప్రాంతాల యువత క్రీడల్లోనూ రాణించాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మండలంలోని తాళ్లగురజాల గ్రామంలో నిర్వహించనున్న వాలీబాల్ పోటీల క్రీడా కిట్లను ఆవిష్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందన్నారు. మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ రామ్ చందర్, నాయకులు రామన్న, సురేష్, క్రీడాకారులు పాల్గొన్నారు.

Similar News

News December 29, 2025

భూపాలపల్లి: ఉపాధి హామీ నిధుల చెల్లింపుల్లో పారదర్శకత!

image

ఉపాధి హామీ పథకంలో నిధుల మంజూరును మరింత పకడ్బందీగా చేసేందుకు ప్రభుత్వం కొత్త మార్పులు చేపట్టింది. పాత పద్ధతిని పక్కన పెట్టి, పీఎఫ్ఎంఎస్, ఎస్ఎన్ఏ స్పార్శ్ మాడ్యూల్ ద్వారా నిధులు విడుదల చేయనుంది. దీనివల్ల ట్రెజరీ నుంచి ఆమోదం పొందిన తర్వాతే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి బిల్లులు జమ అవుతాయి. జిల్లాలోని 1,05,504 జాబ్ కార్డుదారులకు ఈ కొత్త విధానం ద్వారా ప్రయోజనం చేకూరనుంది.

News December 29, 2025

హనుమకొండ: ఒకే గ్రామం.. ఐదు చోట్ల పాలన!

image

జిల్లాలోని వెంకటేశ్వరపల్లి గ్రామస్థుల పరిస్థితి అత్యంత విచిత్రంగా మారింది. గ్రామం పేరు ఒకచోట ఉంటే, మండలం నడికూడ, రెవెన్యూ విభాగం నార్లాపూర్‌, తహశీల్దార్ కార్యాలయం కమలాపూర్‌, పోలీస్ స్టేషన్ పరకాలలో ఉన్నాయి. బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం ఒక మండలంలో దరఖాస్తు చేసి, మరో మండలంలో తీసుకోవాల్సి వస్తోంది. ఏ పత్రాల్లోనూ తమ ఊరి పేరు స్పష్టంగా ఉండటం లేదని, పాలనను క్రమబద్ధీకరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

News December 29, 2025

పాలమూరు: భవనం పైనుంచి పడి ఇంటర్ విద్యార్థిని మృతి

image

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి జారిపడి ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని భావన(17).. రెండో అంతస్తు నుంచి కింద పడింది. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. యువతికి కంటి చూపు సమస్య ఉందని స్థానికులు తెలిపారు. ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని ఎస్సై సద్దాం పేర్కొన్నారు.