News April 3, 2025
NZB: కాంగ్రెస్, బీజేపీలపై MLC కవిత ధ్వజం

X వేదికగా కాంగ్రెస్, బీజేపీలపై బుధవారం నిజామాబాద్ MLC కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లేతో బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా ఆడారన్నారు. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం చేశారన్నారు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు హాజరు పేరిట మమా అనిపించారన్నారు.
Similar News
News April 9, 2025
TU: పరీక్ష ఫీజులకు ఈనెల 15 తుది గడువు

టీయూలో 5సం.ల ఇంటిగ్రేటెడ్ కోర్సులైన అప్లైడ్ ఎకనామిక్స్, ఎంబీఏ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ రెగ్యులర్, బ్యాక్ లాగ్ 6,8,10 సెమిస్టర్‌ల పరీక్షలకు వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. పరీక్ష ఫీజుకు ఈ నెల 15లోగా చెల్లించాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సీవోఈ డా. సంపత్ కుమార్ తెలిపారు. వివరాలకు యూనివర్సిటీ వెబ్సైట్ https://tuadmissions.org/examhome/eb/view/notif.php సందర్శించాలన్నారు.
News April 9, 2025
కారు బోల్తా.. TU విద్యార్థిని మృతి

KMR జిల్లా గాంధారి మండలం మాధవపల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో చిన్నగుట్ట తండాకు చెందిన అంజలి పూజ(22) మృతి చెందింది. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నగుట్ట తండాకు చెందిన 5గురు HYD నుంచి కారులో స్వగ్రామానికి వస్తుండగా మార్గమధ్యలో అడవిపంది అడ్డువచ్చింది. దీంతో ఒక్కసారిగా కారు బోల్తా కొట్టింది. ఈఘటలో అంజలి పూజ మృతి చెందింది. అంజలి పూజ టీయూ సౌత్ క్యాంపస్‌లో చదువుకుంటోంది.
News April 9, 2025
NZB: చెరువులో పడి రైతు మృతి

ఇందల్వాయి మండలంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి ఓ రైతు మృతి చెందాడు. గండితాండకు చెందిన విస్లావత్ నరేందర్ (43) రోజు మాదిరిగా తన పొలంలో ఉన్న గేదెలకు నీరు పట్టేందుకు సోమవారం రాత్రి వెళ్లాడు. అయితే పొలానికు వెళ్లే దారిలో గల చెరువులో ప్రమాదవశాత్తుపడి నీట మునిగి మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ మనోజ్ తెలిపారు.