News April 3, 2025
ప.గో: జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలి..కలెక్టర్

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎన్ఆర్‌జీఎస్ పనుల లక్ష్యాలకు మించి సాధించి రాష్ట్రంలోనే జిల్లాను ప్రథమ స్థానంలో నిలపాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. జిల్లాలో 1,81,101 జాబ్ కార్డులు నమోదు కాబడ్డాయన్నారు. 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో 39 లక్షల పని దినాలు లక్ష్యం కాగా 37.71 లక్షల పని దినాలు కల్పించి 96.69 శాతానికి పైగా లక్ష్యం సాధించి పని కోరిన 1,02,792 కుటుంబాలకు పని కల్పించడం జరిగిందన్నారు.
Similar News
News January 6, 2026
ఆకివీడు: షైనీ ప్రతిభను మెచ్చి కేంద్ర మంత్రి అభినందనలు

అంతర్జాతీయ స్థాయిలో మల్టీ టాలెంటెడ్ అవార్డుతో పాటు ఇటీవల ‘నంది’ అవార్డు గెలుచుకున్న ఆకివీడు మాస్టర్ కేశవ్ కరాటే అకాడమీ శిష్యురాలు ఘంటా షైనీని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అభినందించారు. మంగళవారం ఆయనను కలిసిన షైనీని మంత్రి ప్రత్యేకంగా ప్రశంసించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి, ప్రాంతానికి గర్వకారణంగా నిలవాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు.
News January 6, 2026
పోలవరం రానున్న సీఎం చంద్రబాబు.. ఎప్పుడంటే?

పోలవరంలో సీఎం చంద్రబాబు ఈనెల 7న పర్యటన వివరాలను జిల్లా అధికారులు వివరించారు. 10:40లకు పోలవరం ప్రాజెక్టుకు చేరుకుంటారు. 10:55 నుంచి మధ్యాహ్నం 12:55 వరకు పోలవరం ప్రాజెక్టులోని కాఫర్ డ్యామ్, బట్రస్ గ్యాప్ 1, గ్యాప్ 2, ఈ సి ఆర్ ఎఫ్ డ్యామ్ కుడి కాలువ కనెక్టివిటీ పనులు, ప్రగతిని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు గెస్ట్ హౌస్‌కు చేరుకుని.. 1:40లకు ప్రాజెక్ట్ పనులపై అధికారులతో సమీక్షిస్తారు.
News January 6, 2026
పీజీఆర్‌ఎస్‌లో 13 అర్జీలు స్వీకరించిన ఎస్పీ

భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో పోలీస్ శాఖ ప్రజా సమస్యల పరిష్కార వేదిక సోమవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఆర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..జిల్లా నలుమూలల నుంచి 13 అర్జీలు వచ్చాయని వాటిని సంబంధిత పోలీస్ స్టేషన్‌కు పంపించి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ భీమారావు పాల్గొన్నారు.


