News April 3, 2025
ర్యాగింగ్, ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నారా: ASF SP

మహిళలు చిన్నపిల్లలకు చట్టాలపై షీ టీం ద్వారా అవగాహన కల్పిస్తున్నారని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ కోసం షీ టీంలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలపై ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ పాల్పడినా.. హింసలకు గురైతే జిల్లా షీ టీం లేదా భరోసా సెంటర్ను సంప్రదించాలని పేర్కొన్నారు. మహిళలు అన్యాయానికి గురైనప్పుడు భయపడకుండా.. ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు.
Similar News
News November 8, 2025
నిర్మాణ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలోని ప్రభుత్వ భవనాల్లో చేపట్టిన వివిధ నిర్మాణ పనులను, మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని కలెక్టర్ డీ.కే. బాలాజి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని ‘మీ-కోసం’ హాల్లో సీఎస్‌ఆర్ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై ఆయన సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఆలస్యమైన పనులను త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీలను సూచించారు.
News November 8, 2025
GNT: పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఈ ఏడాది జనవరిలో జరిగిన పలు పీజీ కోర్సుల రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేసినట్లు పరీక్షల నిర్వహణ అధికారి శివప్రసాదరావు శుక్రవారం తెలిపారు. ఎమ్మెస్సీ బయో కెమిస్ట్రీ ప్రథమ, ద్వితీయ, నాలుగో సెమిస్టర్, జులైలో జరిగిన బీటెక్ ప్రధమ, ద్వితీయ, తృతీయ సెమిస్టర్ ఫలితాలు ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.
News November 8, 2025
TODAY HEADLINES

✦ ₹1,01,899Cr పెట్టుబడులకు CM CBN ఆమోదం
✦ బనకచర్ల DPR టెండర్ల ప్రక్రియను రద్దు చేసిన AP
✦ TG: ఫీజు బకాయిల విడుదలకు ప్రభుత్వం అంగీకారం.. రేపటి నుంచి కాలేజీలు రీఓపెన్
✦ కేటీఆర్, కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్: CM రేవంత్
✦ వందేమాతరం గీతాలాపన దేశమాత ఆరాధనతో సమానం: PM
✦ టెక్నికల్ సమస్య.. ఢిల్లీ, ముంబైలో విమాన సేవలకు అంతరాయం


