News April 3, 2025

జంతు సంర‌క్ష‌ణ సామాజిక బాధ్య‌త‌: కలెక్టర్

image

జంతు సంర‌క్ష‌ణ అనేది సామాజిక బాధ్య‌త అని, జంతువుల‌పై క్రూర‌త్వ నివార‌ణ చ‌ట్టం అమ‌లుకు ప‌టిష్ట చ‌ర్య‌లు తీసుకోవాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని ఎన్టీఆర్ జిల్లా క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ అన్నారు. కలెక్టర్ అధ్య‌క్ష‌త‌న విజయవాడలో బుధ‌వారం జంతువుల‌పై క్రూర‌త్వ నివార‌ణ జిల్లా సొసైటీ (డీఎస్‌పీసీఏ) స‌ర్వ‌స‌భ్య స‌మావేశం వ‌ర్చువ‌ల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.

Similar News

News September 18, 2025

పత్తి కొనుగోళ్లు.. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: కలెక్టర్

image

2025-26 పత్తి కొనుగోలు సీజన్‌పై సంగారెడ్డి కలెక్టరేట్‌లో అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులతో కలెక్టర్ ప్రావీణ్య సమీక్షించారు. సీసీఐ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు జరపాలన్నారు. జిన్నింగ్ మిల్లుల తనిఖీలు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియ సజావుగా, రైతులకు లాభదాయకంగా జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.

News September 18, 2025

HYD: పార్కులు కాపాడిన హైడ్రా.. హెచ్చరిక బోర్డులు

image

హైడ్రా అధికారులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుని పార్కు స్థలాలను ఆక్రమణల నుంచి రక్షించారు. కూకట్‌పల్లి మూసాపేట సర్కిల్‌లోని సనత్‌నగర్ కోఆపరేటివ్ సొసైటీ లే ఔట్‌లో 1600 గజాల భూమిని, రంగారెడ్డి జిల్లా మదీనాగూడలో పార్కు కోసం కేటాయించిన 600ల గజాల స్థలాన్ని కాపాడారు. ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు.

News September 18, 2025

నిజామాబాద్, కామారెడ్డి RTCలో ఉద్యోగాలు

image

సుదీర్ఘ విరామం తర్వాత ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి నిజామాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలో ఉద్యోగాల ఖాళీలు ఇలా ఉన్నాయి. NZB జిల్లాలో 49, కామారెడ్డిలో 30 డ్రైవర్ పోస్టులు ఉన్నాయి. NZB జిల్లాలో 19, కామారెడ్డి జిల్లాలో 12 శ్రామిక్ పోస్టులు ఉన్నాయి. అక్టోబర్ 8 నుంచి 28 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.