News April 3, 2025
కష్ణా జిల్లాలో పర్యటించిన కలెక్టర్

కృష్ణా జిల్లాలోని పలుమండలాలతో పాడు పెదపారుపూడి మండలం భూషనగుళ్ల, మహేశ్వరపురంలోని బాలురు, బాలికల పాఠశాలలను బుధవారం పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మంచి నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.
Similar News
News April 10, 2025
కృష్ణా : ముగిసిన ‘పది’ మూల్యాంకణం

మచిలీపట్నం లేడియాంప్తిల్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకణ బుధవారంతో ముగిసింది. ఈ నెల 1వ తేదీన మూల్యాంకణ ప్రారంభమవ్వగా మొత్తం 1,89,852 సమాధాన పత్రాలను మూల్యాంకణ చేశారు. సుమారు 1000 మంది ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులు మూల్యాంకణ విధుల్లో పాల్గొన్నారు.
News April 9, 2025
కృష్ణా: రెవెన్యూ సర్వీసుల దరఖాస్తు ఫీజుల వివరాలు

కృష్ణాజిల్లాలో రెవెన్యూ సర్వీసులకు సంబంధించి దరఖాస్తు ఫీజుల వివరాలను జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం ప్రకటించారు.
* పట్టాదార్ పాస్ బుక్, అడంగల్ సవరణకు రూ.150
* భూ సర్వే, ఆన్ పట్టా సబ్ డివిజన్ కోసం రూ.550
* అడంగల్ సవరణ, కుల, ఆదాయ ధృవీకరణ, నివేశన స్థల ధృవీకరణ పత్రానికి రూ.50ను అధికారులు దరఖాస్తు రుసుంగా వసూలు చేస్తారన్నారు.
News April 9, 2025
కృష్ణా జిల్లా టుడే టాప్ న్యూస్

☞కృష్ణా: మండలానికి 3 నుంచి 4 ఆదర్శ పాఠశాలలు
☞అమరావతి: వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ప్రణాళిక
☞విజయవాడ: ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు
☞కృష్ణా: డిగ్రీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
☞ మొవ్వ: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన కలెక్టర్
☞కృష్ణా: ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు
☞ గుడ్లవల్లేరు: రైలు పట్టాలు దాటుతూ.. వ్యక్తి మృతి
☞ కృష్ణా: జోగి రమేష్‌కు నోటీసులు