News April 3, 2025

MHBD: అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్

image

రాజీవ్ యువవికాసం దరఖాస్తుదారులకు ఏ ఇబ్బందులూ లేకుండా అన్నిఏర్పాట్లు చేయాలని, వేసవిలో తాగునీటికి ఇబ్బంది లేకుండా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్ఆర్ఆజీఎస్, పెన్షన్స్, యూనిఫామ్స్, సెర్ప్‌కు సంబంధించిన పనులు వేగవంతం చేయాలన్నారు.

Similar News

News April 4, 2025

సచివాలయంలో అగ్నిప్రమాదం.. సీఎం ఆగ్రహం

image

AP: సచివాలయంలో <<15986572>>అగ్నిప్రమాదం<<>> జరిగిన ప్రాంతాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. సెక్రటేరియట్‌లో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నారా? లేదా? అని అధికారులను నిలదీశారు. ప్రమాదం ఎలా జరిగిందని ఆరా తీశారు. వెంటనే అన్ని చోట్లా సీసీకెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సచివాలయ ప్రాంగణంలో చెత్త పేరుకుపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24 గంటల్లో చెత్తను క్లియర్ చేయాలని ఆదేశించారు.

News April 4, 2025

నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్

image

AP: ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరికి చెందిన 298 మందికి మంత్రి లోకేశ్ శాశ్వత ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అని, కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువొస్తుందని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని ఆయన చెప్పారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవని తెలిపారు. భూగర్భ విద్యుత్, డ్రైనేజ్, గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడించారు.

News April 4, 2025

శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం: పొంగులేటి

image

TG: శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు. ధాన్యం తరుగు పెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామన్నారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు.

error: Content is protected !!