News April 3, 2025
KMR: పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్

మద్నూర్‌లో నిషేధిత అల్ఫాజోలం పట్టుబడ్డ కేసులో ఇది వరకే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ పత్రికలో పని చేసే మరో వ్యక్తి పైయ్యర్ల శ్రీనివాస్ పరారీలో ఉండగా బుధవారం పట్టుకుని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ రాజేష్ చంద్ర ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో నిషేధిత మత్తు పదార్థాలు కలిగి ఉన్న, సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.
Similar News
News January 10, 2026
మేడారం జాతర.. ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు

TG: మేడారం జాతరలో ఇప్పపువ్వు లడ్డు, బెల్లం లడ్డు ప్రసాదంగా ఇవ్వనున్నట్లు మంత్రి సీతక్క వెల్లడించారు. లడ్డు తయారీ ద్వారా 500 మంది మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. ఈ నెల 18న CM రేవంత్ మేడారానికి వస్తారని, 19న మొక్కులు చెల్లించి జాతరను లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జాతరను జరుపుకుందామన్నారు. కాగా ఇప్పపువ్వులో ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి.
News January 10, 2026
వరంగల్: చికెన్ ధరల పిడుగు.. సామాన్యుడి జేబుకు చుక్కలు

ఉమ్మడి WGLలో కోడి మాంసం ధరలు సామాన్యులకు షాక్ ఇస్తున్నాయి. స్కిన్లెస్ చికెన్ కిలో రూ.320, స్కిన్‌తో రూ.300గా ఉంది. బాయిలర్ కోడి కిలో రూ.200, ఫారమ్ కోడి రూ.220కి పెరిగింది. గుడ్డు ధర ఒక్కటి రూ.8, 30 గుడ్ల కేస్ రూ.240కి చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. జీపీ ఎన్నికల ఖర్చులు, మందుపార్టీలు, మేడారం జాతర వల్ల డిమాండ్ పెరిగి సరఫరా తగ్గడంతోనే ఈ పరిస్థితి నెలకొంది.
News January 10, 2026
నెల్లూరులో వర్షాలు.. నంబర్లు సేవ్ చేసుకోండి

అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజల సహాయార్థం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏమైనా సహాయం కావాలంటే ప్రజలు కంట్రోల్ రూము నెంబర్లు 0861-2331261, 7995576699 /1077 సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.


