News April 3, 2025
జనగామ: కలెక్టర్‌ను కలిసిన జిల్లా ఆర్టీఏ నెంబర్

జనగామకి చెందిన చిలువేరి అభి గౌడ్ జిల్లా రీజినల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్‌గా నియమితులైన సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, డీసీపీ మహేంద్ర నాయక్, సీఐ దామోదర్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రభుత్వం తరఫున, రవాణా శాఖకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన కల్పించడంతో పాటు అందరూ బాధ్యతాయుతంగా ఉండేలా చేసుకోవాలని అధికారులు వారికి సూచించారు.
Similar News
News April 10, 2025
మా సైనికులెవరూ ‘ఉక్రెయిన్’ యుద్ధంలో లేరు: చైనా

చైనా సైనికులు <<16037933>>రష్యా తరఫున ఉక్రెయిన్ యుద్ధంలో <<>>పాల్గొంటున్నారన్న ఉక్రెయిన్ ఆరోపణల్ని బీజింగ్ ఖండించింది. ఆ వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారమైనవంటూ తోసిపుచ్చింది. ‘సాయుధ పోరాటాలు జరుగుతున్న చోటి నుంచి దూరంగా ఉండాలని మేమే మా పౌరులకు చెబుతుంటాం. అలాంటిది యుద్ధానికి పంపుతామా? ఈ యుద్ధంలో మేం తటస్థంగా మాత్రమే ఉన్నాం. ఏ వైపునకూ మా మద్దతు లేదు’ అని తేల్చిచెప్పింది.
News April 10, 2025
జనగామ జిల్లాలో నలుగురు తహసీల్దార్ల బదిలీ

జనగామ జిల్లాలోని నలుగురు తహసీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకుర్తి తహసీల్దార్ పి.శ్రీనివాస్‌ను జనగామ ఆర్డీవో కార్యాలయానికి, దేవరుప్పులకు జనగామ ఆర్డీవో కార్యాలయంలోని డీఏవో ఆండాళ్‌ను, దేవరుప్పుల తహసీల్దార్ మహిపాల్ రెడ్డిని తరిగొప్పులకు, తరిగొప్పుల తహసీల్దార్ నాగేశ్వర్ చారిని పాలకుర్తి తహసీల్దార్‌గా బదిలీ చేశారు.
News April 10, 2025
సంగారెడ్డి: 15 వరకు PM ఇంటర్న్ షిప్ గడువు పెంపు: కలెక్టర్

ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకం రెండవ దశ దరఖాస్తు గడువు ఈనెల 15 వరకు పెంచినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి బుధవారం తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన వారై ఉండాలని చెప్పారు. pminternship.mca.gov.in పోర్టల్ లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు నెలవారి భత్యం రూ.5 వేలు 12 నెలలు అందిస్తారన్నారు.