News April 3, 2025

NGKL: అమ్మాయిలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్త..!

image

మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో షీ టీం పనిచేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Similar News

News October 29, 2025

జిల్లా అధికారులకు కలెక్టర్ సూచనలు

image

జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ MN హరేంద్ర ప్రసాద్ బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుపాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. పారిశుద్ధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్‌‌ల పునరుద్ధరణపై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

News October 29, 2025

వనపర్తి: ఐకెపి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించండి

image

ఐకెపి ద్వారా కేటాయించబడిన అన్ని వరి కొనుగోలు కేంద్రాలను రెండు రోజుల్లో ప్రారంభించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఐకెపి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు అవసరమైన తూకం యంత్రాలు తేమ కొలిచే యంత్రాలు, టార్పాలిన్‌లు మార్కెటింగ్ శాఖ నుంచి తీసుకోవాలని సూచించారు.

News October 29, 2025

తిరుపతి: ఒక్కొక్కరికి రూ.3వేలు

image

తుఫాన్ కారణంగా తిరుపతి జిల్లాలో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. పలువురు బాధితులుగా మారారు. వీరికి ప్రభుత్వం రూ.3వేల సాయం ప్రకటించింది. నారాయణవనం మండలం తుంబూరు సమీపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి కలెక్టర్ వెకంటేశ్వర్ వెళ్లారు. ఒక్కొక్కరికి రూ.3 వేలు, నిత్యావసరాలు అందజేశారు.