News April 3, 2025

కాజీపేట: టాస్క్ ఫోర్స్‌కు చిక్కిన జూదరులు

image

కాజీపేటలోని 100 ఫీట్ల రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లుగా పోలీసులకు అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించారు. ఏడుగురిని అదుపులోకి తీసుకొని వారి వద్ద రూ.27,950 నగదు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను పోలీసులు కాజీపేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బాబులాల్ తెలిపారు.

Similar News

News July 5, 2025

రాజాపేట: డైనింగ్ హాల్‌ను చూసి భయమేసింది: జిల్లా అధికారి

image

రాజాపేట మండలంలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలను శుక్రవారం జిల్లా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి శోభరాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పప్పు కూరలో పోపు సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. డైనింగ్ హాల్‌ను చూసి భయమేసిందని, ఫ్లోరింగ్ ఏర్పాటు చేసి సున్నం వేయాలన్నారు. లైబ్రరీలో చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు. చదువుకునేందుకు కొన్ని అవసరమైన పుస్తకాలను ఏర్పాటు చేయాలని జడ్పీ సీఈఓను కోరారు.

News July 5, 2025

యాదాద్రి గిరి ప్రదక్షిణకు ఏర్పాట్లు పూర్తి: ఈవో

image

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా రేపు గిరిప్రదక్షిణకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు తెలిపారు. ఉదయం 5.30 గంటలకు ప్రదక్షణ స్వామివారి కొండ కింద ప్రధాన (పాదాల చెంత) వైకుంఠ ద్వారం వద్ద ప్రత్యేక పూజలతో ప్రారంభమవుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని పేర్కొన్నారు.

News July 5, 2025

విశాఖ గోల్డ్ వ్యాపారులకు హెచ్చరిక

image

విశాఖలో ఆభరణాల వ్యాపారులకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (B.I.S.) హాల్ మార్కింగ్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించింది. నిబంధనలు గురించి ఆభరణాల వ్యాపారులకు వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చిక్కుడు తప్పవని B.I.S. దక్షిణ ప్రాంత డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ప్రవీణ్ ఖన్నా హెచ్చరించారు. B.I.S. కేర్ మొబైల్ యాప్ గురించి వివరించారు.‌ విశాఖ నుంచి 100 మంది గోల్డ్ వ్యాపారులు హాజరయ్యారు.