News March 26, 2024

బాలికపై లైంగిక దాడికి యత్నం.. 10ఏళ్ల జైలు శిక్ష

image

రాజవొమ్మంగి మండలం మారేడుబాక గ్రామానికి చెందిన చిట్టోజి లోవరాజుకి 10 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ కాకినాడ పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చిందని జడ్డంగి ఎస్సై రఘునాథరావు తెలిపారు. 2018 ఆగస్టు 3వ తేదీన అదే గ్రామానికి చెందిన మైనర్ బాలికపై నిందితుడు లైంగిక దాడికి యత్నించగా.. బాలిక ప్రతిఘటించడంతో కత్తితో దాడిచేసి గాయపరిచాడు. నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారైందని తెలిపారు.

Similar News

News April 2, 2026

YCP కాదు.. ‘వనభోజనం’ పార్టీ అని పెట్టుకో: MLA గోరంట్ల సెటైర్..!

image

వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రతిపాదించిన ‘మావిగన్’ కారిడార్‌పై రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గురువారం ట్విటర్(X) వేదికగా విమర్శలు గుప్పించారు. పార్టీలోని ముఖ్య నేతలైన వంశీలోని VA, నానిలో NA, బొత్సలో BO, జగన్‌లో JA, అప్పల నాయుడులో NA తీసుకుంటే VA-NA-BO-JA-NA వస్తుందన్నారు. ఐదేళ్లలో రాష్ట్ర ఆదాయాన్ని వనభోజనంలా భుజించారని విమర్శిస్తూ, ‘వనభోజనం పార్టీ’గా పేరు మార్చుకోవాలని సూచించారు.

News April 2, 2026

రాజమండ్రిలో బడ్జెట్ 2026-27 ఔట్‌రీచ్ ప్రోగ్రామ్

image

రాజమండ్రి కలెక్టరేట్‌లో మంత్రి నిమ్మల రామానాయుడు నేతృత్వంలో బడ్జెట్ 2026-27 ఔట్‌రీచ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ప్రభుత్వ పథకాల పురోగతి, బడ్జెట్ కేటాయింపులను ప్రజలకు వివరించడమే ఈ కార్యక్రమ ఉద్దేశం. కలెక్టర్ కీర్తీ చేకూరి, జేసీ మేఘ స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. సంక్షేమ పథకాలు అర్హులకు చేరాలని మంత్రి సూచించారు. అభివృద్ధి పనుల వేగవంతంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.

News April 2, 2026

పెదకొండేపూడి గోశాల వెనుక కొండపై పులి విశ్రాంతి: రేంజర్

image

సీతానగరం మండలం పెదకొండేపూడిలో గోశాల వెనుక నేలకోట కొండపై గురువారం ఉదయం పులి ఉన్నట్లు ట్రాకింగ్ ద్వారా గుర్తించినట్లు జిల్లా అటవీశాఖ రేంజర్ దావీదురాజు తెలిపారు. గోకవరం, ఇందుకూరు, రాజమహేంద్రవరం నుంచి మూడు బృందాలతో ప్రస్తుతం పెదకొండేపూడిలో వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. రేంజర్ కొండలరావు మాట్లాడుతూ.. పగటి సమయంలో పులి పూర్తి విశ్రాంతి తీసుకుంటుందని ఈరోజు రాత్రికి దాని కదలికలు తెలుస్తుందన్నారు.