News April 3, 2025

NRPT: SERPలో అంజయ్య అక్రమాలు చేశారంటూ ఫిర్యాదు

image

SERPలో అడిషనల్ DRDO అంజయ్య అక్రమాలకు పాల్పడుతున్నారని పలువురు ఉద్యోగులు ఎమ్మెల్యే పర్ణికా రెడ్డికి ఫిర్యాదు చేశారు. బుధవారం ఆమె ఆఫీస్‌లో అందుబాటులో లేకపోవడంతో PAమాధవరెడ్డికి ఫిర్యాదు అందజేశారు. అడిషనల్ DRDO అంజయ్య కొన్ని వారాలుగా విధులకు హాజరు కాకుండా, అన్ని ఒకేసారి అటెండెన్స్ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తాడని,ఎలాంటి వాహనం వినియోగం చేయకుండా అద్దె డబ్బులు రూ.33,000 జమ చేసుకుంటున్నాడని ఫిర్యాదు చేశారు.

Similar News

News April 4, 2025

నా పోటీ సీఎం చంద్రబాబుతోనే: లోకేశ్

image

AP: ‘మన ఇల్లు-మన లోకేశ్’ కార్యక్రమంలో భాగంగా మంగళగిరికి చెందిన 298 మందికి మంత్రి లోకేశ్ శాశ్వత ఇంటిపట్టాలు పంపిణీ చేశారు. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అని, కుప్పం కంటే ఒక్క ఓటైనా ఎక్కువొస్తుందని చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని ఆయన చెప్పారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవని తెలిపారు. భూగర్భ విద్యుత్, డ్రైనేజ్, గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామని వెల్లడించారు.

News April 4, 2025

శ్రీరామనవమి తర్వాత ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తాం: పొంగులేటి

image

TG: శ్రీరామనవమి తర్వాత రాష్ట్రంలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కట్టిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రైతుల విషయంలో అధికారులు అలసత్వం వహించొద్దని ఆయన ఆదేశించారు. ధాన్యం తరుగు పెడితే మిల్లర్లపై చర్యలు తప్పవని ఓ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా హెచ్చరించారు. అరకిలో ధాన్యం తరుగు తీసినా కేసులు పెడతామన్నారు. రూ.20,609 కోట్ల రుణమాఫీ చేశామని స్పష్టం చేశారు.

News April 4, 2025

HYD: చారిత్రాత్మక కట్టడాలు.. చెత్తతో స్వాగతాలు

image

చారిత్రాత్మక కట్టడాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. అధికారుల అలసత్వం, క్రమశిక్షణ లేని జనం మూలంగా మురికి కూపంలా మారుతున్నాయి. అందుకు నిదర్శనం పాతబస్తీలోని గుల్జార్ హౌజ్ వద్ద ఉన్న వాటర్ ఫౌంటెన్. సందర్శకులను ఎంతగానో అలరించిన నిజాంకాలం నాటి ఫౌంటెన్‌ వద్ద నేడు శుభ్రత కరవైంది. మంచినీటికి బదులు మురికి నీరు దాని నిండా ఖాళీ వాటర్ బాటిల్స్, చెత్త చెదారంతో స్వాగతం పలుకుతున్నాయి.

error: Content is protected !!