News April 3, 2025

గద్వాల: కొత్త పోలీస్ స్టేషన్లు వస్తున్నాయ్..! 

image

గద్వాల నియోజకవర్గ పరిధిలోని కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు సంబంధించి పోలీస్ స్టేషన్ల ఏర్పాటు కోసం స్థలాలను ఎస్పీ శ్రీనివాసరావు బుధవారం పరిశీలించారు. గద్వాల జిల్లా ఏర్పడిన నుంచి కేటీదొడ్డి మండలంలో అద్దె భవనంలో PS ఏర్పాటు చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగా కేటీదొడ్డి, ధరూర్ మండలాలకు పోలీస్ స్టేషన్ల కోసం ప్రభుత్వ స్థలాలను ఎస్పీ పరిశీలించారు. డీఎస్పీ, సీఐ తదితరులు ఉన్నారు.

Similar News

News December 25, 2025

ప్రధాని మోదీ ‘క్రిస్మస్’ ప్రార్థనలు

image

క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ ఢిల్లీలోని కేథడ్రల్ చర్చి ఆఫ్ ది రిడంప్షన్‌లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ‘క్రిస్మస్ స్ఫూర్తి సమాజంలో సామరస్యం, సద్భావాన్ని ప్రేరేపిస్తుంది’ అని పేర్కొన్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఈ పర్వదినాన దేశ పౌరులకు, ముఖ్యంగా క్రైస్తవ సమాజంలోని సోదర, సోదరీమణులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.

News December 25, 2025

వేములవాడ భీమేశ్వరాలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా

image

వేములవాడ భీమన్న ఆలయంలో బ్లాక్‌లో దర్శనాల దందా కొనసాగుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. మేడారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీ పెరగడాన్ని ఆసరాగా చేసుకుని వరంగల్‌కు చెందిన భక్తుల వద్ద రూ.300 చొప్పున వసూలు చేసి దర్శనం కోసం తీసుకువెళ్తున్నట్లు ఆలయ SPF సిబ్బంది గుర్తించి వారిని పట్టుకున్నారు. బ్లాక్ దందాకు పాల్పడుతున్న యువకుడిని చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీ వాసిగా గుర్తించారు.

News December 25, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాను వణికిస్తున్న చలి

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది. దీంతో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని (RG-III) ములకాలపల్లిలో 10.1℃, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని రాఘవపేటలో 10.1℃ నమోదయ్యాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వట్టెంలలో 10.8℃, కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలోని ఆసిఫ్‌నగర్‌లో 10.8℃ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.