News April 3, 2025

MNCL: 28 మంది పరీక్ష రాయలే: DEO

image

మంచిర్యాల జిల్లాలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు డీఈఓ యాదయ్య తెలిపారు. జిల్లాలోని 49 పరీక్షా కేంద్రాల్లో బుధవారం జరిగిన సాంఘీక శాస్త్రం పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 9198 మందికి 9175, గతంలో ఫెయిలైన 11 మంది విద్యార్థులకు ఆరుగురు హాజరైనట్లు పేర్కొన్నారు. మొత్తం 9209 మంది విద్యార్థులకు 9181 మంది పరీక్ష రాసినట్లు వెల్లడించారు.

Similar News

News January 9, 2026

1100కు ఫోన్ చేయవచ్చు: కలెక్టర్

image

అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో సమాచారం తెలుసుకోవాలన్నా కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. అలాగే అర్జీదారులు Meekosam.ap.gov.in వెబ్సైట్‌లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

News January 9, 2026

విశాఖ కలెక్టరేట్లో నగర అభివృద్ధిపై సమీక్ష

image

విశాఖ కలెక్టరేట్‌లో శుక్రవారం ఉదయం నగర అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అధ్యక్షతన కలెక్టర్ హరేంధిర ప్రసాద్, ఎమ్మెల్యేలు, ముఖ్య అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన సమావేశంలో పలు విషయాలపై చర్చించనున్నారు. భూ కేటాయింపులు, శంకుస్థాపనలు, అభివృద్ధిపై సమీక్ష జరగనుంది.

News January 9, 2026

పవన్ కళ్యాణ్‌ను కలిసిన కలెక్టర్, ఎస్పీ

image

కాకినాడ పర్యటనకు విచ్చేసిన పవన్ కళ్యాణ్‌ను పోలీస్ గ్రౌండ్‌లో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ అపూర్వ భరత్, ఎస్పీ బిందుమాధవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు, శాంతిభద్రతల పరిరక్షణపై ఆయన అధికారులతో కొద్దిసేపు చర్చించారు. జిల్లాలో పరిపాలన, భద్రత విషయంలో తాము తీసుకుంటున్న పలు కీలక చర్యలను అధికారులు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంకు వివరించారు.