News April 3, 2025
గద్వాల: ‘GOVT జాబ్ కావాలా.. APPLY చేయండి..!’

ఇండియన్ ఆర్మీలో అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (క్లర్క్/ స్టోర్ కీపర్ టెక్నికల్), అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్ వివిధ కేటగిరీలకు ఆన్‌లైన్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ఉపాధి కల్పనా అధికారి డాక్టర్ ఎం.ప్రియాంక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్‌కు 10వ తరగతి, 8వ తరగతి పాసైన వారు అర్హులన్నారు. SHARE IT
Similar News
News April 4, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 4, 2025
ఉట్నూర్: ‘TASK శిక్షణతో ఉపాధి సాధన సులువు’

యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ సాధనకు మార్గాన్ని సులువు చేయడమే లక్ష్యంగా టాస్క్ ముందుకు సాగుతుందని ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో Campus to Corporate C2C అంశంపై రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ తరగతులకు కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
News April 4, 2025
ఒకేసారి ఆస్తి పన్ను చెల్లిస్తే 5% రాయితీ

AP: 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఒకేసారి ఆస్తి పన్ను చెల్లించిన వారికి 5 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు పురపాలక శాఖ ప్రకటించింది. ఈ నెల 30లోగా చెల్లించిన వారికి ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించింది.