News April 3, 2025
MBNR: 29 వేల మందికి మరో అవకాశం కల్పించిన ప్రభుత్వం

మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ కింద 31,190 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరందరికీ ప్రభుత్వం మార్చి నెలాఖరు వరకు రాయితీతో అవకాశం కల్పించినా కేవలం 2వేల మంది మాత్రమే పరిష్కరించుకున్నారు. మిగిలిన 29 వేల మంది దరఖాస్తుదారులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తూ ఏప్రిల్ నెల వరకు 25 శాతం సబ్సిడీతో పరిష్కరించుకునేలా అవకాశాన్ని పొడిగించింది. ఇకనైనా వీరు ముందుకొస్తారో లేదో వేచి చూడాల్సిందే.
Similar News
News January 12, 2026
కేటీఆర్ పాలమూరు పర్యటన షెడ్యూల్ ఇదే..!

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం మహబూబ్‌నగర్‌లో పర్యటించనున్నారు. HYD నుంచి ఉదయం 9 గంటలకు బయలుదేరి MBNRకు చేరుకుంటారు. 11 గంటలకు పట్టణంలోని పిస్తా హౌస్ నుంచి ఎంబీసీ గ్రౌండ్ వరకు నిర్వహించే బైక్ ర్యాలీలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు జిల్లాలో నూతనంగా ఎన్నికైన పార్టీ మద్దతుదారులు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్లను కేటీఆర్ సన్మానించనున్నారు.
News January 12, 2026
మహబూబ్‌నగర్: కరెంట్ షాక్‌తో రైతు మృతి

కోయిల్‌కొండ మండలంలోని పారుపల్లిలో పొలంలో విద్యుత్ తీగలు సరి చేసేందుకు వెళ్లి ఓ రైతు మృతి చెందాడు. ఎస్ఐ తిరుపాజీ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎల్లపు తిరుపతయ్య (47) బోర్‌కు విద్యుత్ సరఫరా కావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లాడు. అక్కడ విద్యుత్ తీగలను సరి చేసేందుకు ప్రయత్నిస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ కొట్టింది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News January 11, 2026
పాలమూరుకు రానున్న సీఎం రేవంత్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17న పాలమూరుకు రానున్నారు. ఇటీవల MLA శ్రీనివాస్ రెడ్డి CMను కలిసి అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు రావాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో సీఎం సానుకూలంగా స్పందించడంతో పర్యటన ఖరారైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. MBNR మున్సిపల్ కార్పొరేషన్‌లో రూ.12 వేల కోట్ల అంచనాలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేస్తారని ఎమ్మెల్యే చెప్పారు.


