News April 3, 2025
కొండాపూర్ ఆర్ఐ సస్పెండ్.. తహశీల్దార్ బదిలీ

వారసత్వ ధ్రువీకరణ పత్రం మంజూరులో అవకతవలకు పాల్పడిన కొండాపూర్ ఆర్ఐ మహదేవుని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ బుధవారం ఉత్తరుడు జారీ చేశారు. తహశీల్దార్ అనితను నారాయణఖేడ్ ఆర్టీవో కార్యాలయం బదిలీ చేశారు. ఆర్ఐ తప్పుడు నివేదిక ఆధారంగా వారసత్వ బదిలీ సర్టిఫికెట్ ఇచ్చారని కలెక్టర్‌కు బాధితులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా విచారణ చేయించిన కలెక్టర్ వాస్తవమని తేలడంతో సదరు అధికారులపై చర్యలు తీసుకున్నారు.
Similar News
News September 14, 2025
కామన్ డైట్ మెనూ పక్కాగా అమలు చేయాలి: కలెక్టర్

మిట్టపల్లి శివారులోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను కలెక్టర్ హైమావతి శనివారం సాయంత్రం ఆకస్మికంగా పరిశీలించారు. డైలీ స్టాక్ రిజిస్టర్ వెరిఫై చేసిన ఆమె రోజువారీ తీసుకుంటున్న సామాగ్రిని తూకం వేసి తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన కలెక్టర్.. కామన్ డైట్ మెనూను తప్పనిసరిగా ఇంప్లిమెంటేషన్ చేయాలని ఆదేశించారు.
News September 14, 2025
మిలాద్ ఉన్న నబీ ర్యాలీ.. HYDలో ట్రాఫిక్ ఆంక్షలు

మిలాద్ ఉన్ నబీ ఊరేగింపు సందర్భంగా నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ఉ.8 నుంచి రా.8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఫలక్‌నుమా, ఇంజిన్‌బౌలి, నాగుల్ చింత X రోడ్, హరిబౌలి, చార్మినార్, గుల్జార్‌హౌస్, మదీనాజంక్షన్, మీరాలంమండీ, బీబీబజార్, అఫ్జల్‌గంజ్ టీ జంక్షన్, MJమార్కెట్ జంక్షన్, నాంపల్లి ప్రాంతాల్లో ఆంక్షలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలోని పర్యాటక ప్రాంతాలు మూసి ఉంటాయన్నారు.