News April 3, 2025

సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలకు వడివడిగా ఏర్పాట్లను పూర్తి చేశామని దేవస్థాన ఆలయ ఈవో ఎల్ రమాదేవి తెలిపారు. కరోనా తర్వాత శ్రీరామనవమి ఉత్సవాలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు కేబినెట్ మంత్రులు, ఉన్నత అధికారులు, న్యాయమూర్తులు ఇతర ప్రజాప్రతినిధులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

Similar News

News April 6, 2025

‘ఎంపురాన్’ మరో రికార్డ్

image

మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘L2: ఎంపురాన్’ సినిమా మరో రికార్డును సొంతం చేసుకుంది. మలయాళ ఇండస్ట్రీలో అత్యధిక గ్రాస్ కలెక్షన్లు(దాదాపు ₹250Cr) సాధించిన చిత్రంగా నిలిచినట్లు కంప్లీట్ యాక్టర్ ట్వీట్ చేశారు. ఈ విజయంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రేక్షకులు, టెక్నీషియన్లకు ధన్యవాదాలు తెలిపారు. కాగా ఇప్పటి వరకు టాప్‌లో ఉన్న మంజుమ్మల్ బాయ్స్(₹239Cr) రెండో స్థానానికి చేరింది.

News April 5, 2025

ఘోరం.. 13ఏళ్ల క్యాన్సర్ పేషంట్‌పై అత్యాచారం

image

మహారాష్ట్ర థానేలో అమానవీయ ఘటన జరిగింది. క్యాన్సర్‌తో పోరాడుతున్న 13 ఏళ్ల బాలికపై దుర్మార్గుడు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ముంబైలోని ఆస్పత్రిలో చిన్నారికి కీమోథెరపీ చేయిస్తుండగా రొటీన్ పరీక్షల్లో ఈ విషయం బయటికొచ్చింది. దీంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక కుటుంబంతోపాటు నిందితుడు బిహార్‌కు చెందినవారని తెలిపారు. చిన్నారి చికిత్స కోసం ముంబైకి వచ్చినట్లు చెప్పారు.

News April 5, 2025

నారాయణపేట: సీతకు శుభాకాంక్షలు తెలిపిన డీసీసీ అధ్యక్షుడు 

image

తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన కే.సీత దయాకర్ రెడ్డిని నేడు నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కే.ప్రశాంత్ కుమార్ రెడ్డితో పాటుగా పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు కలిశారు. సీతా దయాకర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!