News April 3, 2025
నారాయణపేట: టెన్త్ క్లాస్ పాసయ్యారా..? మీ కోసమే..!

సేవా భారతి, ఇన్ఫోసిస్ నిర్మాణ్ ఆధ్వర్యంలో ఈనెల 4న నారాయణపేట నర్సిరెడ్డి మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు సేవా భారతి పాలమూరు విభాగ్ కార్యదర్శి శ్రీనివాస్ గౌస్ బుధవారం తెలిపారు. జిల్లాలోని టెన్త్ క్లాస్, ఐటీఐ, ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుతున్న, సమానమైన అర్హతలు ఉన్న విద్యార్థులు జాబ్ మేళాలో పాల్గొనవచ్చని చెప్పారు. శుక్రవారం ఉ.10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు.
Similar News
News April 4, 2025
పిల్లలకు SM నిషేధ అంశం పార్లమెంట్ పరిధిలోనిది: సుప్రీంకోర్టు

13 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను వాడకుండా నిషేధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇది పాలసీ అంశమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. దీనిపై చట్టం చేయాలని పార్లమెంట్‌నే కోరాలని సూచించింది. పిటిషనర్లు సంబంధిత విభాగానికి అర్జీ చేసుకుంటే 8 వారాల్లో పరిష్కరించాలని ఆదేశిస్తూ పిటిషన్‌ను కొట్టేసింది.
News April 4, 2025
ప్రముఖ నటుడు కన్నుమూత

ప్రముఖ మలయాళ నటుడు రవి కుమార్(71) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1968లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవికుమార్ 150కిపైగా మలయాళ, తమిళ చిత్రాలు, అనేక సీరియళ్లలో నటించారు. ‘అనుబంధం’ సీరియల్‌తో పాటు రజినీకాంత్ శివాజీ మూవీలో మినిస్టర్ పాత్రతో తెలుగులోనూ గుర్తింపు పొందారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.
News April 4, 2025
ఉట్నూర్: ‘TASK శిక్షణతో ఉపాధి సాధన సులువు’

యువతలో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ సాధనకు మార్గాన్ని సులువు చేయడమే లక్ష్యంగా టాస్క్ ముందుకు సాగుతుందని ప్రిన్సిపాల్ టి.ప్రతాప్ సింగ్ అన్నారు. శుక్రవారం ఉట్నూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టాస్క్ ఆధ్వర్యంలో Campus to Corporate C2C అంశంపై రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ తరగతులు శుక్రవారం ముగిశాయి. ఈ తరగతులకు కళాశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.