News April 3, 2025
తిరుపతి: గంజాయి కేసులో GRP కానిస్టేబుల్ అరెస్ట్

డబ్బుకు ఆశపడి ఓ రైల్వే పోలీస్ పక్కదారి పట్టాడు. గూడూరుకు చెందిన అవినాశ్ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. రైళ్లలో తనిఖీలు చేసే సమయంలో దొరికిన గంజాయిని తన ఫ్రెండ్ సునీల్ ద్వారా విక్రయిస్తున్నాడు. ఈక్రమంలో సునీల్ గూడూరు టూ టౌన్ పోలీసులకు చిక్కాడు. ఐదు ప్యాకెట్ల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సునీల్ ఇచ్చిన సమాచారంతో అవినాశ్‌ను అరెస్ట్ చేశామని సీఐ శ్రీనివాస్ వెల్లడించారు.
Similar News
News April 4, 2025
గ్రూప్1 నియామకాలపై కేసుల కొట్టివేత

తెలంగాణలో గ్రూప్1 పోస్టుల భర్తీకి న్యాయ చిక్కులు తొలగాయి. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు నేడు కొట్టేసింది. దీంతో ఇప్పటికే జనరల్ ర్యాంకింగ్ లిస్టు ఇచ్చిన TGPSC త్వరలోనే సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు పిలిచే అవకాశముంది.
News April 4, 2025
భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాల పంపిణీ

హైదరాబాద్ సైబర్ గార్డెన్‌లో నల్గొండ జిల్లా వీర్లపాలానికి చెందిన యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూ నిర్వాసితుల కోటాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు హాజరై ఉద్యోగార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.
News April 4, 2025
KMM: నూతన రేషన్ కార్డులను వేగవంతం చేయాలి: CS

రేషన్ షాపులకు సన్న బియ్యం రవాణా వేగవంతం చేయాలని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి నిర్వహించిన వీసీలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 30 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యాన్ని పేదలకు అందజేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అటు నూతన రేషన్ కార్డుల దరఖాస్తుల స్క్రూటినీ వేగవంతం చేయాలని CS శాంతి కుమారి సూచించారు.