News April 3, 2025
శ్రీకాకుళం: పోలీసులకు చిక్కిన ప్రేమోన్మాది నవీన్

విశాఖపట్నంలోని మధురవాడలో బుధవారం నవీన్ అనే ప్రేమోన్మాది దీపిక, ఆమె తల్లి లక్ష్మిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. పారిపోతున్న నిందితుడు నవీన్‌ను SKLM జిల్లా బూర్జలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనపై రాష్ట్ర సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత స్పందించారు. దీంతో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి విశాఖకు తరలించారు.
Similar News
News January 18, 2026
రథ సప్తమికి ఆర్ట్స్ కాలేజీలో డ్రోన్ షో

అరసవిల్లి సూర్యనారాయణ దేవస్థానంలో రథసప్తమి వేడుకలు పురస్కరించుకుని శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 23వ తేదీన ప్రతిష్ఠాత్మకంగా డ్రోన్ షో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఓ ప్రకటలో పేర్కొన్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ఈ షో జరుగుతుందన్నారు.
News January 18, 2026
రథసప్తమి వేడుకల పూర్తి షెడ్యూల్ వివరాలు ఇవే

ఈనెల 19 నుంచి 23వరకు జరగనున్న రథసప్తమి వేడుకల షెడ్యూల్ సంబంధిత అధికారులు ఆదివారం ప్రకటించారు. ఆ మూడు రోజులు హెలిప్యాడ్ రైడింగ్ ఉదయం 9-సాయంత్రం 5 వరకు ఉంటుంది. NTR మున్సిపల్ హైస్కూల్లో వివిధ రకాల క్రీడా పోటీలు జరుగుతాయి. KR స్టేడియంలో ఫుడ్ ఎగ్జిబిషన్ కిడ్స్ ప్లే జరుగుతుందన్నారు. 22న 80 ఫీట్ రోడ్డులో 7 గంటల-మెగాసూర్య నమస్కారాలు, సాయంత్రం 5 గంటల నుంచి భక్తి హాస్యపు జల్లులు 23న శోభా యాత్ర ఉంటుంది.
News January 18, 2026
అరసవల్లిలో VIP పాస్ ఇలా పొందండి..!

అరసవల్లి రథసప్తమి ఉత్సవాలకు సంబంధించి ప్రత్యేకంగా దాతల పాస్‌లు అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి ఈనెల 23వ తేదీ వరకు ఇస్తామని ఈవో ప్రసాద్ ఓ ప్రకటనలో తెలిపారు. VIP పాస్‌లను రూ.300లకు అందజేస్తామన్నారు. జిల్లా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికార సిఫార్సు లేఖలతో పాటు ఆర్డీవో ఆఫీసు అదనపు లేఖల ద్వారా VIP పాస్‌లు ఇస్తామని చెప్పారు.


