News April 3, 2025
వక్ఫ్ బిల్లులోని కీలకాంశాలు..

* వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ముస్లింలే ఉంటారు. కనీసం ఇద్దరు మహిళలకు చోటు కల్పించాలి.
* వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర బోర్డుల్లో ఇద్దరు ముస్లిమేతరులను నియమించాలి.
* కొత్త చట్టం అమల్లోకొచ్చిన 6 నెలల్లో ప్రతి వక్ఫ్ ఆస్తినీ సెంట్రల్ డేటాబేస్‌లో చేర్చాలి.
* వక్ఫ్ ట్రైబ్యునల్ తీర్పులను 90రోజుల్లో హైకోర్టులో సవాలు చేసుకోవచ్చు.
* ఈ ట్రైబ్యునల్‌లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి ఉండాలి.
Similar News
News February 10, 2026
సపోటాలో చెక్క తెగులు – నివారణకు సూచనలు

చెక్క తెగులు ఆశించిన సపోటా చెట్ల కొమ్మలు వంకరులు తిరిగిపోతాయి. ఆకులు రాలిపోయి.. కొమ్మలు ఎండిపోయిన చెక్కలుగా మారతాయి. ఈ తెగులును గుర్తించిన వెంటనే కొమ్మలను కత్తిరించి లీటరు నీటికి 3గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 2.5 గ్రాముల మాంకోజెబ్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. మొక్కల్లో ఇనుప ధాతు లోపం లేకుండా ఉండేందుకు 2గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 1గ్రాము నిమ్మ ఉప్పును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
News February 10, 2026
ESIC మోడల్& సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఉద్యోగాలు

కేరళ, కొల్లాంలోని <
News February 10, 2026
ఇంట్లో ఉండకూడని వస్తువులివే..

ఇంట్లో సానుకూల శక్తి పెరగాలంటే కొన్ని వస్తువులను తొలగించాలి. పగిలిన అద్దాలు, పనిచేయని గడియారాలు ఉంచకూడదు. ఇవి ప్రగతిని అడ్డుకుంటాయి. విరిగిన సామాన్లు, చిరిగిన పాత బట్టలు దారిద్ర్యానికి సంకేతాలు. వాడిపోయిన మొక్కలు, ఎండిపోయిన పూలు ఇంట్లో ప్రతికూలతను పెంచుతాయి. యుద్ధం, ఏడుపు, హింసను ప్రతిబింబించే చిత్రాలు గోడలపై ఉండకూడదు. తుప్పు పట్టిన ఇనుప వస్తువులు తొలగించాలి. ఇంటిని శుభ్రంగా, వెలుతురుతో ఉంచాలి.


