News April 3, 2025

కరీంనగర్: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

image

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.

Similar News

News April 4, 2025

మంథని: వామన్‌రావు దంపతుల హత్య కేసు (UPDATE)

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గట్టు వామన్‌రావు న్యాయవాద దంపతుల హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. కేసుకు సంబంధించిన అన్ని రికార్డులను కోర్టుకు సమర్పించాలని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేసింది. రికార్డులను పరిశీలించిన తర్వాతే సీబీఐ విచారణ జరపాలా? లేదా? అనే విషయాన్ని నిర్ణయిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

News April 4, 2025

శంకరపట్నం: పోలీస్ విధులను ఆటంకపరిచిన వ్యక్తిపై కేసు నమోదు

image

కేశవపట్నం పోలీస్ స్టేషన్లో హంగామా సృష్టించిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ కొత్తపల్లి రవి పేర్కొన్నారు. మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన ఎలుకపెళ్లి కళ్యాణ్‌కు ఓ కేసు విషయమై కోర్ట్ సమన్లు ఇవ్వడానికి హోంగార్డ్ సదానందం అతని ఇంటికివెళ్ళగా.. తీసుకోవడానికి నిరాకరించాడు. అనంతరం సాయంత్రం పోలీస్ స్టేషన్ కి వచ్చి పురుగు మందు తాగి చనిపోతానని బెదిరించడంతో కళ్యాణ్ పై పోలీసులు కేసు నమోదు చేసారు.

News April 4, 2025

కరీంనగర్: నేటి నుంచి జిల్లా ఆసుపత్రి కార్మికుల సమ్మె

image

నేటి నుంచి ఆసుపత్రి కార్మికులు సమ్మె చేయనున్నారు. కార్మికుల పెండింగ్ జీతాలను చెల్లించాలని కోరుతూ శుక్రవారం నుంచి సమ్మె చేయనున్నట్లు ప్రభుత్వ ఆసుపత్రి వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బండారి శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. మూడు నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!