News April 3, 2025

VZM: రైలు నుంచి జారిపడి కానిస్టేబుల్ మృతి

image

ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడిన కానిస్టేబుల్ బొబ్బిలి రామకోటి(37) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. జామి మండలానికి చెందిన రామకోటి ప్రస్తుతం కొత్తవలస పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 1వ తేదీన రామకోటి విశాఖ నుంచి విజయనగరం వస్తున్న సమయంలో కోరుకొండ- విజయనగరం రైల్వే స్టేషన్ మధ్య జొన్నవలస సమీపంలో ప్రమాదవశాత్తు జారి పడటంతో మహారాజు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పోందుతూ మరణించాడు.

Similar News

News April 4, 2025

సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తాం: ఎస్పీ 

image

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో పని చేస్తున్న అధికారులు, సిబ్బంది సమస్యల పరిష్కారానికి ఎస్పీ వకుల్ జిందాల్ జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం “పోలీసు వెల్ఫేర్ డే” నిర్వహించారు. ఈ సందర్భంగా ఒక్కొక్కరిని తన ఛాంబర్‌లోకి పిలిచి, వారి వ్యక్తిగత, వృత్తిపరమైన, శాఖాపరమైన సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం వారి నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు.

News April 4, 2025

విజయనగరంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ 

image

విజయనగరంలోని వీటి అగ్రహారంలో ఎలక్ట్రికల్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్‌ను ఏపీ ఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వితేజ్ శుక్రవారం ప్రారంభించారు. ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా రీఛార్జ్ చేసేందుకు ఈ స్టేషన్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. వాహనదారులంతా రీఛార్జి స్టేషన్‌ను సక్రమంగా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఆయనతోపాటు ఈపీడీసీఎల్ జిల్లా అధికారులు ఉన్నారు.

error: Content is protected !!