News April 3, 2025
సిరిసిల్ల: ముగిసిన పదిపరీక్షలు.. పిల్లలపై ఓ కన్నేసి ఉంచండి!

పదోతరగతి పరీక్షలు ముగిశాయి. దీంతో విద్యార్థులు ఫ్రీ బర్డ్స్ లాగా విచ్చలవిడిగా తిరగాలని భావిస్తారు. కావున తల్లిదండ్రులు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలకు మోటార్ బైకులు ఇవ్వొద్దు. స్నేహితులతో చెరువులకు వెళ్లకుండా చూడాలి. వారు ఈత నేర్చుకుంటానంటే తల్లిదండ్రుల పర్యవేక్షణలో నేర్చుకోవాలి. మత్తుపదార్థాలకు అలవాటు పడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలంటున్నారు. PLEASE SHARE IT.
Similar News
News January 14, 2026
చిత్తూరుకు వెళ్లి వస్తుండగా ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

తవణంపల్లి: తెల్లగుండ్లపల్లి ఫ్లైఓవర్ వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కర్ణం వందలూరు గ్రామానికి చెందిన కే. బుజ్జమ్మ (45) భర్త మురుగయ్యతో కలిసి బైకుపై చిత్తూరుకు వెళ్లి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో బుజ్జమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, మురుగయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన మురుగయ్యను చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు.
News January 14, 2026
తాండూర్: స్కూల్‌కు వెళ్లమన్నందుకు సూసైడ్

తాండూర్ మండలం నీలాయపల్లిలోని వడ్డెర కాలనీ చెందిన రుద్ర హనీతేజ (15) చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు మాదారం ఎస్ఐ సౌజన్య తెలిపారు. హనీ తేజ తంగళ్లపల్లి ZPSSలో టెన్త్ చదువుతున్నాడు. డిసెంబర్ 21న స్కూలుకు వెళ్లమని తల్లి మందలించగా ఇంట్లో గడ్డి మందు తాగాడు. హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ వెల్లడించారు.
News January 14, 2026
కామారెడ్డి: పండుగ పూట విషాదం

కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం బొల్లారం గ్రామానికి చెందిన కొంపల్లి సాయిలు (55) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు స్థానిక ఎస్ఐ భార్గవ్ గౌడ్ తెలిపారు. కొంపల్లి సాయిలు గ్రామ శివారులోని లింగోష్ పల్లి చెరువు వద్ద చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతిచెందినట్లు మృతుని కుమారుడు దుర్గాప్రసాద్ ఫిర్యాదులో పేర్కొన్నాడని ఎస్ఐ చెప్పారు.


