News April 3, 2025
మూసీకి పూడిక ముప్పు..!

మూసీ జలాశయానికి పూడిక ముప్పు ముంచుకొస్తోంది. సీడబ్లూసీ గతేడాది నిర్వహించిన సర్వే మూసీకి పూడిక ముప్పును గుర్తించింది. ప్రాజెక్ట్ నిర్మించిన తొలినాళ్లలో నాలుగు నియోజకవర్గాల్లోని 42 వేల ఎకరాలకు పైగా సాగు నీరు, సూర్యాపేట పట్టణానికి తాగునీరు అందించింది. పూడిక పేరుకుపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గి నేడు 30 వేల ఎకరాలకు కూడా సాగు నీటిని అందించలేని దుస్థితికి చేరుకుంది.
Similar News
News April 4, 2025
గద్వాల: ‘14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలి’

గద్వాల జిల్లా కేంద్రంలోని BJP కార్యాలయంలో శుక్రవారం ముఖ్యకార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్నాథ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం, ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈనెల 6 నుంచి 14వ తేదీ వరకు పార్టీ కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. అదే విధంగా బూత్ స్థాయి వరకు ప్రాథమిక సభ్యత్వాలను నమోదు చేయాలని పార్టీ నాయకులకు సూచించారు.
News April 4, 2025
విద్యార్థులకు మెరుగైన విద్య అందించండి: ITDA PO

ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలని ఐటీడీఏ పీఓ కుష్బూగుప్తా ఉపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం ఇంద్రవెల్లి బాలికల ఏకలవ్య మోడల్ రెసిడెన్సీ పాఠశాలను పీఓ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న విద్య, వైద్యం, భోజనంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన విద్యతో పాటు ప్రతిరోజూ మెనూ ప్రకారం పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలని సూచించారు.
News April 4, 2025
38 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్ల ప్రకటన

AP: రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల పంపకం కొనసాగుతోంది. ఇటీవల 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించగా, ఇవాళ మరో 38 కమిటీలకు ప్రభుత్వం నియామకాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జనసేనకు, ఒకటి బీజేపీకి దక్కింది. త్వరలోనే మిగతా కమిటీలకు ఛైర్మన్లను ప్రకటిస్తామని టీడీపీ వెల్లడించింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా 218 మార్కెట్ కమిటీలున్నాయి.