News April 3, 2025
ముస్లిం విద్యార్థులకు ఉచిత విద్య

AP: రాష్ట్రంలోని ముస్లిం విద్యార్థులకు ఇంటర్మీడియట్‌తోపాటు జేఈఈ, నీట్‌కు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెన్త్ పాసైనవారికి టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నారు. ఇందులో మెరిట్ సాధించిన విద్యార్థులకు ఎంపిక చేసిన కార్పొరేట్ కళాశాలలో వారు కోరుకున్న కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. దీనికయ్యే ఖర్చును వక్ఫ్ బోర్డు భరించనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం ప్రారంభం కానుంది.
Similar News
News April 4, 2025
AI వినియోగం.. భవిష్యత్‌పై బిల్‌గేట్స్ జోస్యం!

ఏఐ రాక నేపథ్యంలో భవిష్యత్తులో ఉద్యోగాలెలా ఉంటాయన్నదానిపై బిల్ గేట్స్ పలు ఇంటర్వ్యూలో జోస్యం చెప్పారు. అవి:
* వారానికి రెండు రోజులే పని ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఏఐ పనిచేస్తుంది.
* దాదాపు ఉద్యోగాలన్నీ ఏఐ చేతిలోకి వెళ్లిపోతాయి.
* ఏఐ వలన అన్ని రంగాల్లో మేథ అందరికీ ఉచితంగా లభిస్తుంది.
* కోడింగ్, బయాలజీ, ఇంధన రంగాల్లోకి మాత్రం ఏఐ రాలేదు.
News April 4, 2025
హసీనాను అప్పగించమన్నారు: విక్రమ్ మిస్రీ

మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని బంగ్లాదేశ్ విజ్ఞప్తి చేసిందని విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు. ప్రధాని మోదీ- బంగ్లా ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ భేటీ సందర్భంగా ఈ విషయం చర్చకు వచ్చినట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో హిందువులు, ఇతర మైనారిటీల రక్షణ, భారత్‌లోకి అక్రమ చొరబాట్లను అడ్డుకునే విషయాలు మహ్మద్ యూనస్‌తో చర్చించినట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.
News April 4, 2025
BIG ALERT: పిడుగులతో కూడిన భారీ వర్షాలు

AP: రాష్ట్రంలో 3 రోజులపాటు విభిన్న వాతావరణం కొనసాగుతుందని APSDMA వెల్లడించింది. ఉత్తరాంధ్రలో కొన్ని చోట్ల రేపు, ఎల్లుండి పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఎల్లుండి కాకినాడలో మోస్తరు వానలు, సోమవారం అల్లూరి, కాకినాడ, తూ.గో, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందంది. మిగతా జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.