News April 3, 2025

BNG: ఆర్మీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలని జిల్లా ఉపా ధికల్పన అధికారి సాహితి తెలిపారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, ట్రేడ్‌మెన్ పోస్టులు ఉన్నాయన్నారు. ఐటీఐ, డిప్లొమా, ఎన్‌సీసీ కలిగిన వారికి బోనస్ మార్కులు ఉంటాయని పేర్కొన్నారు. www. joinindianarmy.nic.వెబ్‌సైట్‌లో ఈ నెల 10 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 04027740205 ఫోన్ నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

Similar News

News April 5, 2025

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

image

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 15 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,327 మంది దర్శించుకోగా, 26,354 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

News April 5, 2025

ఎలమంచిలి: ఆకాశాన్ని అంటుతున్న నిమ్మకాయల ధర

image

నిమ్మకాయల ధర ఆకాశాన్ని అంటుతుంది. నిమ్మకాయల దిగుబడి తగ్గడంతో పాటు వేసవి నేపథ్యంలో ధరలు బాగా పెరిగాయి. ఎలమంచిలి మార్కెట్లో నెలరోజుల కిందట కేజీ ధర రూ.40 వరకు ఉండగా ప్రస్తుతం రూ.160కి పెరిగింది. రూ.20కి 4 కాయలు కూడా రావటం లేదని వినియోగదారులు వాపోయారు. కాగా ఎలమంచిలి మార్కెట్‌కు ఎక్కువగా రాజమండ్రి నుంచి వ్యాపారులు నిమ్మకాయలు దిగుమతి చేసుకుంటారు.

News April 5, 2025

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పడిపోతున్న భూగర్భ జలాలు

image

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, యాసంగి పనులు మొదలు పెట్టడంతో నీటి వినియోగం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. HNK జిల్లాలో ఫిబ్రవరిలో 6.30 మీటర్ల లోతుకు నీరు పడిపోగా.. మార్చి చివరి నాటికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. WGL జిల్లాలో డిసెంబర్‌లో 4.18కు పడిపోగా.. మార్చి చివరి నాటికి 6.32 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.

error: Content is protected !!